మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠ పురం లో సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకున సినిమా రిలీజ్ నేపథ్యంలో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రీతిలో విజయాలు సాధించడంతో రాబోయే 'అలా వైకుంఠపురం లో' సినిమాతో ఖచ్చితంగా సంక్రాంతికి బన్నీ- త్రివిక్రమ్ కలిసి హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి మ్యూజిక్ అందించిన థమన్ అల్లుఅర్జున్ అభిమానులలో మరింత జోష్ సినిమాలో ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్లో తాజాగా ఒక వార్త వినబడుతుంది.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన మూడు పాటలు సౌత్ ఇండస్ట్రీ లో మరి యూట్యూబ్ లో ఏ హీరో సాధించిన రికార్డులు అల్లు అర్జున్ సినిమా సాధించడంతో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే మిగతా విడుదల కావాల్సిన పాటల విషయంలో థమన్ మాస్ బిట్లు బాగా ఇచ్చారు అని అల్లు అర్జున్ ఎనర్జీ డాన్స్ కి తగ్గ విధంగా థమన్ బాణీలు ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే క్రమంలో సినిమాకి సంబంధించి టీజర్ పై అభిమానులు హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు.

 

త్వరలో టీజర్ విడుదల కానున్న నేపథ్యంలో టీజర్ కూడా పాటలు మాదిరిగానే రికార్డులు క్రియేట్ చేయాలి అని అభిమానులు ఇప్పటి నుండే 'అలా వైకుంఠపురం లో' టీజర్ కి సంబంధించి సోషల్ మీడియాలో తమదైన శైలిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. మరోపక్క ఈ సినిమాతో ఎలాగైనా తెలుగు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అల్లుఅర్జున్ ఆలోచిస్తున్నాడు. నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి 'అలా వైకుంఠపురం లో' సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: