గత కొద్దీ నెలలుగా హిట్ లేని నాగచైతన్య పెళ్లయ్యాక మొదటి సారి వీరిద్దరూ కలిసి నటించిన సినిమా మజిలీ సూపర్ హిట్ అవ్వడంతో నాగ చైతన్య కథలో హిట్ చేరింది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాల కథలను వింటూ సైన్ చేస్తూ వస్తున్నారు. సమంత, చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం చైతన్య సినీ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించేలా చేసింది. 

 

మరో విషయమేంటంటే ఈ సినిమా తర్వాత సమంత నటించిన ఓ బేబీ చిత్రం కూడా హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే చైతన్య, మామ వెంకీ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉండగా సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై చిత్ర యూనిట్  భారీ అంచనాలని పెట్టుకుంది. ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నాడు. 

 


టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల తరువాతే ఎవరైనా . ప్రస్తుతం ఈయన నాగచైతన్య ,సాయిపల్లవి జంటగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కథను బట్టి ఈ సినిమాకి 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో వున్నారు.ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. 

 

వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు నారాయణదాస్ నారంగ్ ,రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించనున్నాడు. విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ప్రస్తుతం నాగచైతన్య నటించిన వెంకీ మామ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.మజిలీని మించిన రేంజులో ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.. ఈ సినిమా హిట్ అయితే చైతు రేంజు పూర్తిగా మారినట్లే.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: