తెలుగు చిత్రపరిశ్రమలో రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య  కలిసి నటించిన ప్రేమమ్ సినిమా హిట్ అయ్యింది. నిజానికి ఆ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు చాలా కాలం తరువాత ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ గా తాజాగా నటిస్తున్న సినిమా వెంకిమామ. గోదావరి గట్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఉంది. 

 

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో ఈ సినిమా పై చిత్రయూనిట్ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే మొన్న రాశిఖన్నా పుట్టిన రోజు సందర్బంగా ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ డైలాగులతో మొదలైంది. అందుకే మంచి వ్యూస్ తో దూసుకుపోయింది.  


.

కె.ఎస్‌.(బాబీ ) రవీంద్ర దర్శకత్వంలో సురేశ్‌ బాబు, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజపుత్, నాగచైతన్య కు జోడిగా రాశికన్నా నటించారు. ఈ చిత్రాన్ని వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. వెంకిమామ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని ఈ సినిమా సందడి చేస్తుంది. 

 

ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పోస్టర్స్, సాంగ్స్ అద్భుత స్పందన లభించింది. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుంది అని చిత్రబృందం తెలిపింది.ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులతో పాటుగా సినిమా జనాలు, క్రిటిక్స్  నుండి మాటలు వినపడుతున్నాయి. ఎం జరుగుతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: