సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చిరంజీవి వీరాభిమాని. అనంత శ్రీరామ్ కు సినిమాలలో పాటలు వ్రాసే అవకాశాన్ని మొదట్లో ఇచ్చింది చిరంజీవి మాత్రమే అనీ ఈయువ గేయ రచయిత ఒక ఇంటర్వ్యూలో ఈమధ్య చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇవ్వడం షాకింగ్ గా మారడమే కాకుండా పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రస్తుతం తిరుపతిలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగు భాషా వేత్తలు పాల్గొన్న తెలుగు విజయం కార్యక్రమంలో పాల్గొంటూ తెలుగు భాషను అశ్రద్ధ చేస్తున్న విషయం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు హీరోలకు సరిగ్గా తెలుగు మాట్లాడటం రాదనీ కనీసం తెలుగు వ్రాయడం చదవడం రానివారు కూడ హీరోలుగా చలామణి అవుతున్నారు అంటూ తెలుగు సినిమా డైలాగ్స్ లో అదేవిధంగా పాటలలో బూతులు ఎక్కువైపోయాయని ముఖ్యంగా తెలుగు సినిమా పాటలలో పాండిత్యం కరువైపోయింది అంటూ కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఈ నేపధ్యంలో పవన్ కామెంట్స్ పై ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ స్పందిస్తూ ‘పాటలకు కావలసింది పాండిత్యమా ? సాహిత్య మా ?’ అంటూ పవన్ కామెంట్స్ పై రివర్స్ పంచ్ వేసాడు. వాస్తవానికి ఒక మంచి పాట రాయడానికి మంచి పదాల కూర్పు ఉండాలి. ఆ ప్రతిభ సాహిత్యం పై పట్టు ఉంటేనే కుదురుతుంది. 

కేవలం పాండిత్యం ఉన్న వాళ్ళు అంతా సాహిత్యం వ్రాయలేరు. ఈ విషయాలను పవన్ దృష్టికి తీసుకు వస్తు అనంత శ్రీరామ్ కామెంట్ చేసాడని భావించాలి. అయితే పవర్ స్టార్ కామెంట్స్ కు ఒక సినిమా గేయ రచయిత రివర్స్ పంచ్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసైనికులతో మాట్లాడుతూ తాను అన్ని విషయాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని అంటూ తాను ఎలాంటి వారిని అయినా ప్రశ్నిస్తాను అంటూ చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తుంటే పవన్ రాజకీయాలు వదిలి ఇప్పట్లో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం కనిపించడంలేదు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: