తెలుగు చిత్ర పరిశ్రమలో పద్దతులు, ఫార్ములాలు మారిపోయాయి. ఇదే మన భాషలో చెప్పాలంటే విలువలు లేకుండా పోయాయి. పాత రోత కొత్త వింత. అందుకేనేమో పబ్లిసిటీలో టెక్నిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్పట్లో గోడకు మైదా పోసి వాల్ పోస్టర్లు అంటించేవారు. అదే పెద్ద పబ్లిసిటీ. ఆ పోస్టర్స్ చూసే జనాలు థియోటర్స్ కి పరిగెత్తుకు వచ్చేవారు. ఇక్మాస్త ముందుకు వెళితే రిక్షాలో మైక్ పెట్టి ఈ వారం ఏ సినిమా వస్తుందో వీధి వీధి తిరిగి చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ గోడలకు పోస్టర్లు అంటిస్తే జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఎప్పటినుంచో ఉన్న ప్రింట్ మీడియా ప్రమోషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. కానీ సోషల్ మీడియా ప్రమోషన్స్.. టీవీ ప్రమోషన్స్ బాగా ఊపందుకున్నాయి. అయితే వీటితో పాటుగా సినిమాకు ప్రచారం కల్పించేందుకు 'అంతకు మించి' అన్న ఐడియాలతో తెలుగు ఫిలిం మేకర్లు తయారవున్నారు.

 

అయితే ఇలాంటి కొత్త రకం ప్రమోషన్స్ వల్ల ఎంత లాభం కలుగుతుందనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రీసెంట్‌గా ఒక తెలుగు సినిమా విడుదల రోజు మార్నింగ్ షో ఉచితం అన్నారు. ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా తాగే జనాలకు మన సమాజంలో బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఫ్రీ షో చూడటానికి ఎగబడ్డారు. కానీ రెండవ ఆట నుంచి పరిస్థితి తిరగబడిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి ఈ వింత ఐడియా ఎంతవరకూ పని చేసిందంటే సినిమా డైలాగ్ లా 'కొంతవరకూ పనిచేసింది'. అసలు సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికీ తెలియకుండా రిలీజ్ కావడం కంటే ఇది కాస్తో కూస్తో బెటర్. కనీసం ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని చాలామందికి తెలిసింది. సినిమాలో కనుక నిజంగా సత్తా ఉంటే పికప్ కూడా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా బాగా లేకపోడమే దెబ్బకొట్టింది.

 

ఇదో కొత్త తరం ఐడియా అనుకుంటే.. రీసెంట్ గా 'మథనం' టీమ్ మరో కొత్త ఐడియాని అప్లై చేశారు. తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యకుండా అమెరికాలో మాత్రమే విడుదల చేస్తారట. అమెరికాలో ఈమధ్య లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమా ఒక్కటీ లేదన్న విషయం అందరికీ తెలుసు మరి వీళ్ళకి తెలీదేమో. నిజం మాట్లాడుకుంటే కొందరు స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఖర్చులు కూడా రావడం లేదు. చిన్న సినిమాల కోసం అమెరికా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. దీంతో కలెక్షన్స్ లేక అమెరికా డిస్ట్రిబ్యూటర్లు దేవుడా అంటూ మొత్తుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ సినిమాను అమెరికాలో మాత్రమే రిలీజ్ చెయ్యడం అంటే ఇదో పెద్ద జోక్. ఇలాంటి విచిత్రమైన ఐడియాలతో తమ సినిమాను మేకర్లే దెబ్బతీసుకుంటున్నారని ఇండస్ట్రీ సీనియర్లు వెల్లడిస్తున్నారు. అసలు ఫ్యాషన్ తో సినిమాలు తీసే వాళ్ళు తగ్గిపోయారు..ఇంకేదో కావాలి దానికి లో బడ్జెట్ లో చిన్నా చితకా సినిమాలు తీసి తెలుగు సినిమా పరువు మంటగలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: