చిరంజీవి మెగా స్టార్ హోదాలో ఉన్నా తన ఇంటిలో మాత్రం తన పిల్లలతో ముఖ్యంగా తన మనవలతో చేసే అల్లరిని చూసిన వారికి చిరంజీవి ఒక టాప్ స్టార్ అన్న అభిప్రాయం కలగదు అంటూ ఆయన కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే చిరంజీవి తన పిల్లలను ఒక తండ్రిలా కాకుండా ఒక స్నేహితుడులా వారితో కలిసిపోతు వారికి నచ్చే విషయాలు మాట్లాడుతూ మధ్యమధ్యలో జీవితం గురించి చదువు ప్రాధాన్యత గురించి మంచి చెడులను గురించి వివరిస్తూ తమకు ఎన్నో విషయాలను చిరంజీవి చెప్పేవారని సుష్మిత ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

తెలుగు భాష సంస్కృతి పట్ల ఎంతో ఇష్టం ఉన్న చిరంజీవి తన పిల్లలు తెలుగు భాషను ఎక్కడ మర్చిపోతారో అన్న ఉద్దేశ్యంతో తమకు చిన్ననాటి నుండి రకరకాల కథలు తెలుగులో చెపుతూ తమకు తెలుగు పట్ల అభిరుచి ఏర్పడేలా చిరంజీవి వ్యవహరించిన విషయాలను ఆ ఇంటర్వ్యూలో సుష్మిత గుర్తుకు చేసుకుంది. ఇప్పుడు అదే పద్ధతిని చిరంజీవి తన మనవల విషయంలో కూడ అనుసరిస్తున్నాడట. 

కొన్ని రోజుల క్రితం తన కూతురుకు చిరంజీవి ఒక జానపద కథను చెపుతున్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో సుష్మిత మెగా అభిమానులకు షేర్ చేస్తూ చిరంజీవి లాంటి తాతను పొందిన తన కూతురు అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పవన్ తెలుగు భాష పరిరక్షణ కోసం పవన్ ఉద్యమం చేస్తున్న నేపధ్యంలో సుష్మిత తన కూతురుకు చిరంజీవి తెలుగు కథ చెపుతున్న ఫోటోను అందరికీ షేర్ చేయడం ద్వారా తన బాబాయి చేస్తున్న ఉద్యమానికి సుష్మిత పరోక్షంగా సహకరిస్తున్నట్లు అనిపిస్తోంది.

ప్రస్థుతం సుష్మిత షేర్ చేసిన ఈ ఫోటో మెగా అభిమానుల మధ్య వైరల్ గా మారింది. ఒకవైపు పవన్ తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమాలు చేస్తూ అనేకమంది చేత విమర్శలు కూడ ఎదుర్కుంటూ ఉంటే పరోక్షంగా ఇలా చిరంజీవి కూతురు పవన్ ఉద్యమానికి ఇలా సంఘీభావం తెలియచేసిందా అంటూ కొందరు మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: