టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లోనే కాకుండా పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. టాలీవుడ్ లో ఎక్కువ యాడ్స్ చేస్తున్న హీరోగా కూడా టాప్ లో ఉన్నాడు. సినిమాలతో పాటు ఇలా కూడా మహేవ్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. చారిటీలు, ఫ్యామిలీతో వెకేషన్స్ సరేసరి. ఇలా.. బిజినెస్ మేన్ నుంచి  కంప్లీట్ మేన్ గా మహేశ్ రాణిస్తున్నాడు. తాను ఏషియన్ ఫిల్మ్స్ తో కలిసి ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ నిన్నటితో ఏడాది పూర్తి చేసుకుంది. దీనిపై మహేశ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

 

 

‘ఏఎంబీ సినిమాస్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా టీమ్ ఏఎంబీకి అభినందనలు తెలిపాడు. ఈ ఏడాదిలో ఏఎంబీలో 310 సినిమాలు విడుదలయ్యాయి. 12,755 షోలు పడ్డాయి. రెండు మిలియన్ల టికెట్లు తెగాయి.. అంటే ఇరవై లక్షల మంది ఏఎంబీలో సినిమాలు చూశారు. మీ ఆదరణకు కృతజ్ఞతలు’ అంటే తన సోషల్ మీడియా అకౌంట్ లో గణాంకాలతో సహా వెల్లడించి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఏఎంబీ సినిమాస్ ప్రారంభం నుంచే మంచి ఆదరణ దక్కించుకుందనే చెప్పాలి. మహేశ్ బ్రాండింగ్ తో పాటు.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నిర్మాణం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. దీంతో ప్రేక్షకుల సందర్శన కూడా ఎక్కువైంది.

 

 

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో రారాజులుగా వెలుగుతున్న ప్రసాద్ ఐమాక్స్, పీవీఆర్ లకు పోటీగా వచ్చిన ఏఎంబీ సినిమాస్ త్వరగానే పోటీలో చేరి ఆదరణ దక్కించుకుందనే చెప్పాలి. మహేశ్ తెలిపిన గణాంకాల ప్రకారం మల్టీప్లెక్సుల్లో ఈ స్థాయిలో ఏడాదికి రెండు మిలియన్ల టికెట్లు తెగడమంటే ఓ రికార్డుగానే చెప్పాలి. అత్యాధునిక హంగులతో నిర్మాణం కావడం వల్ల ఓసారి చూడాలనుకుని కూడా ప్రేక్షకులు ఎక్కువగా రావడం కలిసొచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: