ఇద్ద‌రు స్టార్ హీరోలు.. ఇద్ద‌రు యంగ్ స్ట‌ర్స్‌... భారీ క్రేజ్‌.. ఫ్యాన్ ఫాలోయింగ్‌.. భారీ మార్కెట్ ఉన్న వాళ్లే. ఈ ఇద్ద‌రు హీరోల‌తో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి చేస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. రు.250 కోట్ల పై చిలుకు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాను వ‌చ్చే జూన్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా 10 భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

ఈ మల్టీస్టార‌ర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. రాజమౌళి కూడా ఈ చిత్ర టాకీపార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 6 నెలలకు పైగా తీసుకోవాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ గిరిజ‌న నాయ‌కుడు కొమ‌రం భీంగా న‌టిస్తుంటే.. అటు రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ రెండు పాత్ర‌ల విష‌యంలో రాజ‌మౌళి చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. చరణ్ జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ అమ్మాయి ఒలివియా న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో సీతారామరాజుగా న‌టిస్తోన్న చ‌ర‌ణ్‌కు రొమాంటిక్ సీన్లు పెద్ద‌గా లేవ‌ట‌.. ఉన్న రెండు మూడు సీన్ల‌లోనే చ‌ర‌ణ్ రొమాన్స్ అంతంత మాత్రంగా ఉంద‌ట‌. అయితే అదే టైంలో ఒలివియాతో మాత్రం ఎన్టీఆర్ వీర లెవ‌ల్లో రొమాన్స్ పండిస్తున్నాడ‌ట‌. ఇక్క‌డ ఎన్టీఆర్ పూర్తిగా డామినేట్ అయ్యేట్లు ఉండ‌డంతో రాజ‌మౌళి త‌ల ప‌ట్టుకుంటున్నాడ‌ట‌.

 

రేపు ఏ తేడా వ‌చ్చినా చ‌ర‌ణ్ ఫ్యాన్స్ రాజమౌళిని టార్గెట్‌గా చేసుకుని విరుచుకు ప‌డ‌తారు. ఇది బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్ప‌టికే ఈ టార్గెట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు రాజ‌మౌళికి అదే టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. ఇక తెలుగు, తమిళ, మళయాల, హిందీ సహా మొత్తం 10 భాషల్లో rrr విడుదల కానుంది. మొత్తానికి రొమాన్స్ విషయంలో చరణ్‌ను దాటేసాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: