బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా మొదలైన దగ్గర్నుండి ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అదే జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించి, జయ మరణం తర్వాత సిఎం పీఠం కోసం ప్రయత్నించి జైలుకి వెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ పాత్రను ఎవరు చేస్తారు అని.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న‌ వెలువడాల్సి ఉంది. అలాగే దివంగత నేత, మాజీ సీఎం ఎంజిఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది.

అమ్మ జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయం నిన్నటి వరకు సస్పెన్స్ గా ఉన్నది.  అనేక పేర్లు తెరమీదకు వచ్చినా ఎవర్ని డిసైడ్ చేయలేదు.  అయితే, ఇప్పుడు నిచ్చెలి శశికళ పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి నటిస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి ప్రియ‌మ‌ణి ఆ పాత్ర‌కు న్యాయం చెయ్య‌గ‌ల‌తా లేదా అన్న‌ది తెర మీద చూడాలి. ఇక‌పోతే చాలా గ్యాప్ త‌ర్వాత ప్రియ‌మ‌ని తిరిగి సినిమాలో న‌టించ‌బోతుంది. ఈ మ‌ధ్య త‌ను టీవీషోస్‌లో త‌ప్పించి పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డంలేదు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య దేవత, అమ్మ, తలైవి , గ్రేట్ పొలిటీషియన్ జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.  “తలైవి “మూవీ అక్టో బర్ 10వ తేదీ చెన్నై లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న “తలైవి” మూవీ 2020 సంవత్సరం జూన్ 26 వ తేదీ రిలీజ్ కానుంది.

లెజండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్ జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా “తలైవి ” మూవీ రూపొందుతుంది. జయలలిత సినీ జీవితం లోనూ, రాజకీయ జీవితంలోనూ పలువురి ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా సినీజీవితం లో లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, రాజకీయ జీవితం లో లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి ఎమ్ జి రామచంద్రన్, డి ఎం కే పార్టీ అధ్యక్షుడు కరుణానిథి, శశికళ, జానకీ రామచంద్రన్, పలువురి ప్రముఖుల ప్రమేయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: