ఈ సంవత్సరం తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన సినిమాలలో సైరా ఒకటి. సాహో వచ్చిన నెలలోపే తెలుగు నుండి వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో  విడుదల అయింది. అయితే సాహో సినిమా పై ఉన్న అంచనాలని ఆ సినిమా అందుకోనందున సైరాకి ఎక్కువ ప్రమోషన్లు చేయలేదు. సైరా సినిమా ప్రమోషన్లని లో ప్రొఫైల్ లో మెయింటైన్ చేశారు. అయితే చివరికి అలా చేయడం వల్లే సినిమాకి దెబ్బ పడింది.

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరాసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల అయింది. రాయలసీమ కు చెందిన మొదటితరం ఉద్యమ వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది.  అయితే ఒక్క తెలుగులో మినహా ఈ సినిమా మిగతా భాషల్లో పెద్దగా విజయం సాధించలేదు. మిగిలిన భాషల్లో ఈ సినిమాకి ఆదరణ అంతంత మాత్రమే లభించింది.

 

అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. అప్పటికే సాహో సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో సైరా నిర్మాతలు ఈ సినిమాని అతి జాగ్రత్తగా జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అందువల్ల సినిమా ప్రమోషన్లలో కొరత ఏర్పడింది. ఆ కొరత సినిమా కలెక్షన్ల మీద కూడా పడింది. మంచి క్వాలిటీతో, పెద్ద స్టార్ నటులతో చిత్రించిన ఈ చిత్రం వేరే భాషల్లో అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ప్రసుతం ఈ సినిమా దుమ్ము రేపుతుందట.

 

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ చిత్రం వేరే భాషల వారిని విపరీతంగా ఆకట్టుకుంటుందట. ఈ మూవీ తమిళ, మలయాళ, కన్నడ వర్షన్స్ ని కూడా ప్రేక్షకులు అధికంగా చూస్తున్నారని సమాచారం. దాదాపు ముఫ్పై కోట్లు పెట్టి అమెజాన్సినిమా హక్కులని కొనుక్కుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: