నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం ‘రూలర్ ’. ఇటీవ‌ల వ‌చ్చిన‌ ఎన్టీఆర్ బయోపిక్ అయిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల‌తో నిరాశ పరిచిన బాలకృష్ణ.. రూలర్ చిత్రంతో ఆ లోటును పూడ్చాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవలే విడుదలైన ‘రూలర్’ టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. 

 

ఇక ఈ చిత్రంలో బాలయ్య  రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు.. ఒక పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గాను .. మరో పాత్రలో బిజినెస్ మేన్ గాను కనిపించనున్నాడు. సాధారణంగా హీరోలు రెండు పాత్రలను చేసినప్పుడు ఒక పాత్ర అదరగొట్టేసేదిగా .. మరో పాత్రను కాస్త అమాయకంగా డిజైన్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదట. ఈ రెండు పాత్రలు కూడా యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేస్తాయని అంటున్నారు. శత్రువులతో ఈ రెండు పాత్రలు తలపడే సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ఇక పోలీస్.. గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథాంశం. ఇక రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. బాలయ్య అభిమానులకు అన్నిరకాల మసాలాలను ఈ సినిమాతో అందించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. 

 

ఇక‌ ఈ సినిమాకు సంబంధించిన పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘అడుగడుగో యాక్షన్ హీరో’ అనే తొలి సాంగ్‌‌ను డిసెంబర్ 1న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సాంగ్‌లో బాలయ్య స్టిల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వెయిట్ ఉన్న పాత్రలను ఎంచుకొని, నట విశ్వరూపాన్ని చూపే బాలయ్య.. ఈ సాంగ్‌లో యంగ్ హీరోలా కనిపించాడు. కాగా, బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. మ‌రియు ప్రకాశ్ రాజ్‌, జయసుధ, భూమికా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: