తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ కార్యక్రమంగా ‘జబర్ధస్త్ ’ కామెడీ షో దుమ్మురేపుతుంది. ఈ కామెడీ షో ఏడేళ్ల క్రితం మొదలైంది..ఇప్పటికీ టీఆర్పీ రేటింగ్ లో దూసుకు వెళ్తుంది.  ఇప్పటి వరకు తమ స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్లు ప్రస్తుతం తెలుగు వెండి తెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇక జబర్ధస్త్ తో యాంకర్ గా పరిచయం అయిన అనసూయ అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించింది.  ఆ తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది..దాంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పింది.  ఆమె స్థానంలో అప్పటికే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నడుస్తున్న రష్మీ గౌతమ్ జబర్ధస్త్ లోకి యాంకర్ గా పరిచయం అయ్యింది.

 

‘జబర్ధస్త్’ లో అనసూయ హాట్ హాట్ గా కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేస్తూ వచ్చింది..దాంతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.  అదే స్థాయిలో రష్మి సైతం తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచింది.  దాంతో రష్మికి వెండితెరపై హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి.  ప్రస్తుతం జబర్ధస్త్, ఢీ షోలో పాల్గొంటున్న రష్మీ తాజాగా తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపుతుంది. లంగా ఓణీలో సాంప్రదాయంగా మరియు స్టైలిష్ గా ఉన్న ర‌ష్మి భార‌త్‌లో తీన్‌మార్ స్టెప్పులు వేసి అంద‌రు నోరెళ్ళ‌పెట్టేలా చేసింద‌ట‌. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి డ్యాన్స్ చేయించింది.

 

ర‌ష్మి స్టెప్పుల‌ని చూసిన చుట్టు ప‌క్క‌ల వారు ఫిదా అయ్యారు. రష్మి సోదరుడు రష్మి సోదరుడు మలేయ్ త్రిపాఠి వివాహానికి పలువురు రాజకీయ మరియు వెండితెర బుల్లి తెరకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుక కోసం త‌న ప‌నుల‌న్నీ ప‌క్క‌న పెట్టి వారం రోజుల ముందే త‌న ఇంటికి వెళ్ళింద‌ట ర‌ష్మి. ఇక త‌మ్ముడి పెళ్లి హ‌డావిడి పూర్తి కావ‌డంతో త్వ‌ర‌లో త‌న ప్రొఫెష‌న‌ల్ వ‌ర్క్‌తో బిజీ కానుంది ర‌ష్మి.  ఈ వేడుక‌లో ర‌ష్మి సంద‌డి మాములుగా లేదని అభిమానులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: