విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్. పూరి కనెక్ట్స్ నిర్మాణంలో పూరి జగన్నాథ్, చార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. సాధారణంగా చాలా వేగంగా స్క్రిప్ట్ రాసే పూరి ఈ సినిమాకి కొంచెం టైమ్ తీసుకుంటున్నాడట.

 

పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ల సినిమాల స్క్రిప్టు పనులను వారం రోజుల్లో పూర్తి చేయగల సత్తా ఉన్న పూరిసినిమా కోసం సమయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమాని అన్ని సినిమాల్లా కాకుండా పాన్ ఇండియా బేస్ లో ప్లాన్ చేస్తున్నారట. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కి పాన్ ఇండియా పరంగా క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ లో సైతం విజయ్ కి మంచి క్రేజ్ ఉంది.

 

అందుకని ఈ సినిమాని పాన్ ఇండియా బేస్ లో తీయాలని చూస్తున్నారట. దాని కోసం స్క్రిప్ట్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మెరుగులు దిద్దుతున్నారట. పురి జగన్నాథ్ కి కూడా బాలీవుడ్ లో మంచి పేరుంది. అమితాబ్ బచ్చన్ తో తీసిన బుడ్డా హోగా తేరే బాప్ సినిమా బాగానే నడిచింది. అండువల్ల ఈ సినిమాకి అన్నీ కలిసొస్తాయనే ఉద్దేశ్యంతోనే పాన్ ఇండియా బేస్ లో ప్లాన్ చేశారట.

 

అటు విజయ్ కి ఉన్న క్రేజ్, పూరి జగన్నాథ్ క్రేజ్ కలిపి ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో బాగానే క్రేజ్ రావొచ్చని తెలుస్తుంది. అదీ గాక ప్రమోషన్లని పెంచి కథలో కొత్తదనం చెప్పడంలో వైవిధ్యం ఉంటే ఏ సినిమానైనా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయవచ్చు. మరి పూరి తీసే సినిమాలో ఇవన్నీ ఉంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించడం పెద్ద కష్టం కాదనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: