‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సాధించిన ఘన విజయంతో యంగ్ హీరో కార్తికేయ ఒకేసారి క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే ఆక్రేజ్ ఎక్కువ కాలం ఆహీరోకు నిలబడ లేదు. ఆ తరువాత ఈ యంగ్ హీరో నటించిన సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడమే కాకుండా విలన్ గా మారుదామని ప్రయత్నించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ కూడ ఫ్లాప్ కావడంతో ఈ యంగ్ హీరో కెరియర్ ప్రశ్నార్ధకంగా తయారైంది. 

ఇలాంటి పరిస్థితులలో ఇతడు ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ’90 ఎమ్ ఎల్’ మూవీకి సెన్సార్ సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా రేపు విడుదల కావలసి ఉంది. అయితే ఈ మూవీకి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని తెలుస్తోంది. 

ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన సీన్స్ తో పాటు కొన్ని అశ్లీల అర్ధాలు ద్వనించే డైలాగ్స్ ఉన్నాయని వాటిని అన్నింటిని తొలిగించమని సెన్సార్ వర్గాలు పట్టుపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథ రీత్యా ఆ సన్నివేశాలు చాల అవసరమని ఈ మూవీ నిర్మాతలు వాదిస్తున్నట్లు టాక్. 

ఒక వింత వ్యాధితో బాధపడే ఒక యువకుడు  ప్రతి రోజు 90 ఎమ్ ఎల్ ఆల్కాహాల్ తాగుతూ జీవించడానికి ప్రయత్నించే ఒక యువకుడి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అయితే ఇలాంటి మూవీలో అశ్లీల పదాలు సీన్స్ ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. ఈమధ్య కాలంలో స్త్రీల పై జరుగుతున్న సంఘటనలతో సినిమాలలో బూతులను అశ్లీల సన్నివేశాలను నిషేదించాలి అని పోరాటాలు జరుగుతున్న పరిస్థితులలో దాని ప్రభావం ఈ 90 ఎమ్ ఎల్ పై పడిఉంటుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా రేపు విడుదల అవ్వడం కష్టం అన్న ప్రచారం జరుగుతోంది. మరి కార్తికేయ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: