'అర్జున్ రెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఇచ్చిన విజయంతో వర్షం సినిమా ఛాన్సులు అందుకని ఇండస్ట్రీస్ లో చేతిలో ఎక్కువ సినిమాలు కలిగిన హీరోగా అప్పట్లోనే సంచలనం సృష్టించారు. దీంతో విజయ్ దేవరకొండ తన దగ్గరికి వచ్చిన ప్రతి సబ్జెక్ట్ నీ ఓకే చేసి సినిమాలు చేయడంతో 'గీతా గోవిందం' సినిమా తర్వాత పెద్దగా విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఏవి కూడా అభిమానులను మరియు సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ మొత్తం తన మార్కెట్ విస్తరించే పనిలో భాగంగా ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా దక్షిణాది ఇండస్ట్రీలో ఉన్న అన్ని భాషలలో విడుదల చేయడం జరిగింది. అయితే రిజల్ట్ దారుణంగా ఫ్లాప్ టాక్ రావడంతో ముఖ్యంగా తెలుగులో అయితే అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో తీవ్ర నిరుత్సాహం చెందాడు విజయ్ దేవరకొండ.

 

ఇదే క్రమంలో నిర్మాతగా మారి విజయ్ దేవరకొండ తీసిన సినిమా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం జరిగింది. దీంతో తన దగ్గరికి వచ్చే ప్రతి సబ్జెక్ట్ ఆచితూచి ఓకే చేసి ప్రస్తుతం సినిమాలు మొదలు పెడుతున్నాడు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు సినిమా యూనిట్. సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా మాదిరిగా విజయ్ దేవరకొండ లుక్ ఉండటంతో సినిమా పై విజయ్ దేవరకొండ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో సినిమాలో ఎక్కడా కూడా అభిమానులకు బోర్ కొట్టే విధంగా సినిమా ఉండకుండా విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.

 

అంతేకాకుండా సినిమాలో క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. ఆ సీన్స్ లో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూస్తారని చిత్ర యూనిట్ నుంచి టాక్ వస్తోంది. దర్శకుడు క్రాంతి మాధవ్ గతంలో డైరెక్ట్ చేసిన ఓనమాలు - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలకు సంబందించిన నటన అద్భుతంగా ఉంటుంది.ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా దర్శకుడు అలానే ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ విషయంలో చాలా స్పీడ్ గా సన్నివేశాలను చిత్రీకరించిన వీలైనంత త్వరగా సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: