వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీసి ఎంతో మందితో కయ్యం పెట్టుకున్నాడు. అలా కయ్యం పెట్టుకున్న వారిలో గేయ రచయిత జొన్న విత్తుల గారు కూడా ఒకరు. జొన్న విత్తుల గారు పాటల రచయితగా సాధించిన పాపులారిటీ కంతే వర్మతో పెట్టుకున్న గొడవ వల్లే ఎక్కువ పాపులర్ అయ్యారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే పేరు వివాదాస్పదం అవుతుందని మార్చమని చెప్పినందుకు వర్మ జొన్నవిత్తుల గారిని జొన్న విత్తుల చౌదరి గారని పిలవడంతో స్టార్ట్ అయిన గొడవని సోషల్ మిడియా సాక్షిగా రోజుకో మలుపు తిరిగింది.

 


అదే సందర్భంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ పెరిగింది. వర్మ జొన్నవిత్తుల చౌదరి అని అంటే జొన్న విత్తుల గారు వర్మకి పప్పు వర్మ అని పేరు కూడా పెట్టారు. అయితే అదే సందర్భంలోనే పప్పు వర్మ పేరు మీద సినిమా తీస్తానని కూడా ప్రకటించాడు. అయితే అదంతా ఊరికే అన్నాడేమో అనుకున్నారు. కానీ జొన్న విత్తుల గారు దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఆ సినిమా పనులు రెడీ అవుతున్నాయట.

 

వర్మ లాంటి పోలికలున్న వ్యక్తిని ఉత్తర భారతం నుండి పట్టుకొచ్చాడట. అలాగే వర్మ బాడీ లాంగ్వేజి, శైలి, నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట. మొత్తానికి వర్మ మీద సినిమా తీయడం ఇంత సీరియస్ గా తీసుకోవడం ఆశ్చర్యం వేస్తుంది. అయితే వర్మని విమర్శించే వారు ఈ విషయం విని సంబరపడిపోతున్నారట. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఈ సినిమా ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.

 

అలాగే వర్మ తన మీద సినిమాలు ఎవరైనా తీసుకోవచ్చని చెప్పాడు. మరి వర్మసినిమా గురించి పట్టించుకుంటాడా లేదా చూడాలి. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: