కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకొని వివాదాస్పదమైన పాటలు ట్రైలర్లు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసి సినిమాకి హైప్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కి మించిన డైరెక్టర్ మరొకరు లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి నేపథ్యంలో గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి ఎన్నో వివాదాల నడుమ ఆ సినిమా విడుదల చేయడం కోసం తీవ్రంగా కష్టపడిన ఆర్జీవీ తాజాగా తాను తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో కూడా అదే స్థాయిలో విడుదల కోసం కష్ట పడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రెండు సామాజిక వర్గాలకు చెందిన బలమైన రాజకీయ నేతలను ఉద్దేశించిన పోలిన విధంగా సినిమా ఉందని విమర్శలు రావడం మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీల నేతలు రాంగోపాల్ వర్మ సినిమాలు తెరకెక్కిస్తున్న విధానంపై మండిపడుతున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఈ పాటికే రిలీజ్ కావాలి. కానీ ఆ సినిమా పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు సెన్సార్ సమస్య కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇటువంటి నేపథ్యంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకి సెన్సార్ ఇవ్వాలంటే కనీసం 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువలన సెన్సార్ ఇవ్వలేమని.. కావాలంటే రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేశారు సెన్సార్ బోర్డు కి సంబంధించిన వారు. ఈ పరిణామంతో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా యూనిట్ రివైజింగ్ కమిటీకి అప్లై చేశారు.

 

ఆ కమిటీ వాళ్లు సినిమా చూడడానికి ఒప్పుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో దాని బట్టి రిలీజ్ ఉంటుంది. అయితే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నా కానీ సినిమా రిలీజ్ చేయటంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదల చేయడం గ్యారెంటీ అనే టాక్ ప్రస్తుతం నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: