ఇటీవల దిశా అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ వార్త విని ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు భారత దేశానికి తమ దేశానికి చెందిన ఆడవాళ్లను పంపించడానికి చాలా ఆలోచిస్తున్నట్లు వీలైతే ఆ దేశానికి వెళ్లకుండా ఉండాలని సదరు మహిళలకు ఆ దేశ అధికారులు సూచనలు ఇస్తున్నట్లు అనేక వార్తలు ఇటీవల అంతర్జాతీయంగా వినబడుతున్నాయి. ఇదే క్రమంలో దిశా అత్యాచారం ఘటనపై దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు సెలబ్రిటీలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక కామెంట్లు అభిప్రాయాలు తెలియజేస్తూ వీడియోల రూపంలో కూడా కొంతమంది సమాజంలో మార్పులు రావాలని ఇటువంటి ఘటనలు జరిగితే ఆడజాతి భారతదేశంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియజేసుకుంటూ వచ్చారు.

 

సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే దిశా అత్యాచారం ఘటనకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష బహిరంగంగా వేయాలని పెద్ద గోలపెడుతూ బాధితురాలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ జస్టిస్ ఫర్ దిశా అని ఎవరికి వారు ఈ ఘటనపై మాట్లాడుతూ సమాజంలో మార్పులు రావాలని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే విధంగా ఎవరికి వారు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వ్యవహరించారు. అయితే తాజాగా సమాజంలో మార్పులు రావాలని కోరుకుంటున్న జనాలు జరిగిన ఘటన ప్రదేశానికి వెళ్లి సెల్ఫీల దిగుతూ చాలా విచిత్రంగా మనిషి కంటే హీనంగా సంఘటన జరిగిన చోట ప్రవర్తిస్తున్నారు.

 

విషయంలోకి వెళితే హైదరాబాద్ శివారు ప్రాంతం షాద్ నగర్ లో ఈ ఘటన జరగటంతో సంఘటన జరిగిన స్థలానికి కుటుంబ సమేతంగా జనాలు వెళ్లి సెల్ఫీలు తిడుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ చాలా వికృతంగా ప్రవర్తిస్తున్నారని చుట్టుప్రక్కల ఉన్న జనం సిగ్గుపడుతున్నారు. సమాజంలో మార్పులు రావాలని కోరుకుంటున్న జనాలే అటువంటి దారుణమైన సంఘటన స్థలానికి వెళ్లి రాక్షస ఆనందం పొందటం బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో మృగాలు అడవిలో ఉన్నాయా..? లేకపోతే సమాజంలో ఉన్నాయా..? అన్నట్టుగా సమాజం మారిపోతుందని...తాజాగా ఈ ఘటన స్థలానికి వెళ్తున్న జనాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇదే తరుణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఇదే విధంగా జనం వ్యవహరిస్తున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: