ఈ మద్య సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొంత మంది.. రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది.. జీవితంపై విరక్తితో మరికొంత మంది ఇలా సినీ సెలబ్రెటీల మరణ వార్తలు అభిమానులను, సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచుతున్నాయి. ఈ మద్య సౌత్ కొరియాలో కొంతకాలం క్రితం పలువురు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. గతంలో కొరియన్ పాప్ స్టార్ సులీ ఆత్మహత్య చేసుకున్నారు. ట్విస్ట్ ఏంటేంటే.. సౌత్ కొరియాకి చెందిన కొందరు ఆర్టిస్టులు మానసిక పరిస్థితి కారణంగా మృత్యువు ఒడిలో చేయడం అదరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇలా ఎందుకు జరిగినా.. తమ అభిమాన నటీనటులు ఉన్నట్టుండి చనిపోవం షాక్ కి గురి చేస్తుంది.  

 

తన గానంతో కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న కొరియన్ పాప్ స్టార్ సులీ అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ఈ దారుణ ఘటన మరువక ముందే.. ఆరు నెలల తరువాత మరో ఆర్టిస్ట్ గో హరా మృతదేహం ఒక అపార్ట్మెంట్ లో దొరికింది.  దాంతో ప్రపంచ వ్యాప్తంగా అసలు సౌత్ కొరియాలో లో ఏం జరుగుతుంది...ఇలా సెలబ్రెటీలు ఎందుకు మరణిస్తున్నారన్న అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ఘటనల కారణంగా సౌత్ కొరియాకి చెందిన కొందరు ఆర్టిస్ట్ ల మానసిక స్థితి దిగజారిందని, నటన విషయంలో ఒత్తిడి ఎదురవుతున్నదని అంటున్నారు.

 

ఈ ఘటనలు మరువక ముందే మరో నటుడి అనుమానాస్పద మరణం సంచలనం రేపుతుంది. కొరియాలో 'ది బ్యాంకర్', 'లవ్ విత్ ఫ్లాస్' వంటి డ్రామా షోలలో నటించిన ఛా ఇన్ హా(27)అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అతని అభిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది. ఛా ఇన్ హా మృతి చెందిన విషయాన్ని దక్షిణ కొరియా పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు.ఛా ఇన్ హా అంతిమ సంస్కారాలను కూడా ప్రైవేట్ గా ఎలాంటి హడావిడి లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: