జీవితంలో వచ్చేవి ఏవి ఎవరికి శాశ్వతం కావు. కాని వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని ఒడ్దుకు చేరడమే వివేకవంతుల లక్షణం. ఇది ప్రతివారికి వర్తిస్తుంది. ఇక అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు ఆహ్వానించాలే గాని ఆలస్యం చేసి తరువాత తలుపుతీస్తే మన గుమ్మం ముందు మనకోసం అది ఆగదుకదా. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఎప్పుడో జరుగుతూనే ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు అదృష్టం దోబూచులాడగా దురదృష్టం వెంటపడ్డ చందాన కొందరి హీరోయిన్ల పరిస్దితి ఉంది. అందివచ్చిన అవకాశాలు చేజార్చుకుని తర్వాత ఆగమయ్యారు.

 

 

ఇలాంటి వారిలో ఉన్నవారెవరో తెలుసుకుంటే సమంత, అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్ ఉన్నారు.. ఇకపోతే కాలం కలిసిరాకపోతే, కథను ఊహించుకోవడంలో విఫలమై సినిమాలు వదులుకుని ఆతర్వాత బాధపడ్డవారు ఉన్నారు. ఎవడు మూవీ రామ్ చరణ్ సరసన సమంత చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరక పోవడంతో శృతిహాసన్ ఛాన్స్ ఎగరేసుకుపోయింది. గబ్బర్ సింగ్ తర్వాత ఎవడు మూవీతో సత్తా చాటిన శృతి ఊపిరి మూవీలో నటించాల్సి ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ తో గొడవ కారణంగా పక్కకు జరిగింది. ఇదే ఛాన్స్ అనుకుంటూ తమన్నా ఆ పాత్రలో ఒదిగిపోయింది.

 

 

అలాగే రంగస్థలం మూవీలో ఛాన్స్ ని అనుపమ పరమేశ్వరన్ వదులుకుంది. దీంతో సమంత ను ఈ అవకాశం వరించి, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక అర్జున్ రెడ్డి మూవీని హిందీలో తీయగా,అందులో తారా సుతారియా నటించాల్సి ఉండగా, అవకాశాన్ని జారవిడుచుకోవడంతో కియారా అద్వానీ నటించింది. ఇదే కాకుండా బ్లాక్ బస్టర్ మూవీ  గీత గోవిందం లో విజయ్ దేవరకొండ సరసన  హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్,లావణ్య త్రిపాఠి లాంటి వాళ్లకు ఛాన్స్ వచ్చినా వదులుకున్నారు.

 

 

చిన్న హీరోతో ఏమిచేస్తాం లే అనుకుని రకుల్ ,లావణ్య కాళ్లదగ్గరకు వచ్చిన ఛాన్స్ ని కాలదన్ను కున్నారు. ఇందులో అను ఇమ్మానియల్ మాత్రం గెస్ట్ రోల్ వేసినా ,క్రెడిట్ మాత్రం రష్మిక తన్నుకుపోయింది. అందుకే అంటారు దురదృష్టం పక్కన ఉన్నప్పుడు తాడు కూడా పామవుతుందని. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇందుకేనేమో అనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: