టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యధిక రెవెన్యూ ని రాబడుతున్న ఏరియాల్లో ఓవర్సీస్ మార్కెట్ కూడా ఒకటి అనే చెప్పాలి. కొన్నేళ్లుగా రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు ఇప్పటివరకు అక్కడ మంచి కలెక్షన్ రాబట్టిన విషయం తెలిసిందే. అయితే రాను రాను డిజిటల్ మాధ్యమాల్లో సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అక్కడి పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. అదీకాక కొన్ని పెద్ద సినిమాలకు అక్కడ టికెట్ ధరలు కూడా అధికంగా ఉంటూ ఉండడడంతో కొందరు ప్రేక్షకులు అంత ధరపెట్టలేక థియేటర్స్ కు రావడం తగ్గించారు. 

 

ఇక రిలీజ్ అయిన నెల రోజుల తరువాత చాలావరకు సినిమాలు డిజిటల్ మాధ్యమాల్లో అందుబాటులోకి వస్తుండడం కూడా అక్కడి కలెక్షన్స్ తగ్గుదలకు కొంత కారణం అని, దానితో పాటు అక్కడ తమ సినిమాలు భారీగా రిలీజ్ చేస్తున్న నిర్మాతలు, ప్రమోషన్స్ విషయమై మాత్రం సరిగ్గా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో అక్కడ 2 మిలియన్లకు పైగా కలెక్షన్ అందుకున్నవి చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక్క మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఓవర్సీస్ లో కూడా మన సినిమాలు బాగా కలెక్షన్ రాబడుతున్నాయని, అలానే నైజాం కు ధీటుగా అక్కడ కూడా మన సినిమాలు అదరగొట్టడం మంచి పరిణామం అని ఇటీవల కొందరు డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగింది. 

 

కాగా వాటిలో చాలవరకు వాస్తవం లేదని, వస్తున్న కలెక్షన్ ని మరింత జోడించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని సమాచారం. అందుకే దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలు ఓవర్సీస్ పై దృష్టిపెట్ట లేదని అంటున్నారు. అయితే ఇకపై ఇటువంటివి జరుగకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ వారు అక్కడ ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి, ఇకపై అక్కడ రిలీజ్ అయ్యే టాలీవుడ్ సినిమాల పబ్లిసిటీ, కలెక్షన్ విషయమై పూర్తిగా పర్యవేక్షణ చేయించనున్నారట. అలానే ఇకపై అక్కడ కూడా మన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టే విధంగా మరిన్ని చర్యలు కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: