వచ్చేనెలలో రాబోతున్న సంక్రాంతి మహేష్ బన్నీల మధ్య ఇగో వార్ గా మారడంతో ఈ వార్ మధ్య సుమారు 400-500 కోట్ల మేర బెట్టింగ్ నడుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సంక్రాంతి రేస్ హీట్ ఎక్కబోతోంది. 2020 సంక్రాంతి వార్ కు సంబంధించిన బిజినెస్ 500 కోట్లకు పైగా జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోతున్న సంక్రాంతికి 3 భారీ సినిమాలతో పాటు మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాలు విడుదలకు సరిపడే ధియేటర్లు లేకపోయినా ఇంతమంది సంక్రాంతికి క్యూ కట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రధాన పోటీ ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మధ్య నడుస్తున్న నేపధ్యంలో ఈ రెండు మూవీల పబ్లిసిటీ విషయంలో కూడ విపరీతమైన పోటీ ఏర్పడింది. 

ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించి టీజర్లు లిరికల్ వీడియోల మధ్య వార్ జరుగుతున్న నేపధ్యంలో ఈ రెండు సినిమాల ప్రీరిలీజ్ ఆడియో వేడుకలను ‘సాహో’ ‘సైరా’ ఈవెంట్ల రేంజు లో అత్యంత భారీ బడ్జెట్ తో చేయడమే కాకుండా ఎంచుకునే వెన్యూ దగ్గర నుండి ఆహ్వానించే అతిధుల వరకు చాల విభిన్నంగా కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలకు మహేష్ బన్నీల అభిమాన సంఘాల నుండి అత్యధికంగా జనం వచ్చేలా చేసి ఈ విషయంలో కూడ తమ ఆదిపత్యం నిరూపించుకోవాలని ఇప్పటికే మహేష్ అల్లు అర్జున్ పిఆర్ టీమ్ లు తమ ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే అనీల్ రావిపూడి దిల్ రాజులు జూనియర్ ఎన్టీఆర్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ ఫంక్షన్ కోసం ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన త్రివిక్రమ్ అల్లు అర్జున్ లు తమ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ రెండు మూవీల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడ మహేష్ బన్నీల వ్యక్తిగత ప్రతిష్టకు పరీక్షగా మారాయని వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: