అమ్మాయిల విషయం లో జరుగుతున్న అమానుష దాడులు, హత్యలు రోజు రోజుకు రెట్టింపవుతున్నాయి. మొన్న నిర్భయ ఇటీవల జరిగిన ప్రియాంక రెడ్డి హత్య కు పోలీసులు నిర్దారించిన పేరు  దిశ ఈ  ఘటన తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అలాగే ఈ సంఘటనపైనా పార్లమెంటులో చర్చలు, ప్రభుత్వం పైన ప్రతిపక్షం మాటలయుద్ధం జరిగిన  సంగతి తెలిసిందే.

ఈ  ఘటనపై  అందరు చలించిపోయారు ప్రతిఒక్కరు స్పందించారు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు విశ్లేషకులు ఇలా అందరు స్పందించారు అందులో ఒకరైన  ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.   ఈ సందర్భంగా విలేకరులు అడిగిన అసలు సెలబ్రిటీలు ఎందుకు బయటికొచ్చి నిరసనలు తెలియజేయట్లేదు ఎలాంటి శిక్షలు విధిస్తే దిశ లాంటి ఘటనలు జరగవు అన్న ప్రశ్నలు సంధించారు. దానికి అయన వారిని తప్పుపడుతూ సినీ కళాకారులు అన్యాయాన్ని, అలసటను, దుర్మార్గాలను  సమాజం లో రూపుమాపడానికి ఎంతో చక్కగా చూపిస్తారు వారు చేసే నటనతో వారు ప్రతిఒక్కరి మదిని తట్టిలేపుతారు అని  అలాగే రాజకీయనాయకులు ఎన్నిసార్లు చెప్పిన వినని ప్రజలు ఒక్క సినిమా లో   మేము చూపించే సన్నివేశం తో చాల వరకు ప్రభావం చూపుతామని  సూచించారు.  స్త్రీని గౌరవంగా సమాజంలోకి తీసుకురావడానికి ఏం చేయాలో వాటన్నింటినీ ప్రభుత్వం చేస్తే అప్పుడే బాగుటుందని ఆయన తెలిపారు.సెలబ్రిటీలు ఎందుకు బయటికొచ్చి నిరసనలు తెలియజేయట్లేదు అన్న ప్రశ్నకు మాకు మనసు అనేది ఉంటుంది అని అన్యాయాన్ని ఎదుర్కోవాలని, నిరసనలు తెలపాలని ఉంటుంది కానీ బయటికివస్తే 
ఈ దరిద్రపు సమాజం మేము ఓదార్చడానికి వస్తే  సెల్ఫీలు అని ఆటోగ్రాఫ్ అని అక్కడి సందర్భాన్ని మార్చేస్తారు.

దిశ ఘటనపై బాధపడేవారికంటే సెలబ్రిటీలతో సెల్ఫీలు తీసుకుందామనే దరిద్రులు ఎక్కువగా ఉంటారు. ఆ దరిద్రం రాని రోజే సినిమావాళ్లు బయటికొస్తారు అప్పటిదాకా బయటికి రారు. సినీ ప్రముఖులకు, కళాకారులకు,  హీరోలకు అందరికి  బాధ ఉంది  మనస్పూర్తిగానే బాధపడుతున్నారు. ఆ నలుగురు  నిందితులను చంపేయాలంత కోపంతోనూ ఉన్నారు.  ఎవరైనా చనిపోయిన దగ్గరికెళ్లినా ఇదే సెల్ఫీల గోల కేకలేస్తారు జిందాబాద్ అంటారు ఏంటీ దరిద్రం.! అని తన ఆవేదనను వ్యక్తం చేసారు.  ఇలా పబ్లిక్ లో ఒక సమస్యను ఏర్పడకూడదనే ఉద్దేశం తోనే   సినిమా వాళ్లు బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు. మేం నిరసన తెలియడానికి వచ్చి అక్కడున్న పరిస్థితిని చెడగొట్టిన వాళ్లమవుతాం. ఈ పరిస్థితి మన తెలుగువాళ్లలోనే ఎక్కువగా ఉంది అని అంటే దీనిబట్టి మన తెలుగు రాష్ట్రాలలోని పనికిమాలిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అర్ధం అవుతుంది అని అన్నారు అలాగే  జనాలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: