టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాలంలో హీరోగా కూడా నటిస్తున్నారు. కమెడియన్ నుండి హీరోగా మారిన  శ్రీనివాస రెడ్డి ఈ సారి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని రూపొందించిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. పాత తరం నటుల్లో పద్మనాభం, రాజబాబు పలువురు కమెడియన్లు పలు సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఫ్లయింగ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న మూవీ ‘భాగ్యనగర వీధుల్లో’. ఈ మూవీ ఈనెల 6న విడుదల కానుంది.  ఇటీవల కాలంలో కామెడీ మూవీస్ కి మంచి ఆదరణ వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కామెడీతో అందరినీ అలరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. 

 

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ మూవీ మేం చిన్న కాన్సెప్ట్‌ గానే మొదలుపెట్టాం.   ఈ సినిమాకు ముందు నేను నిర్మాత‌ను మాత్ర‌మే. కానీ వేరే డైరెక్ట‌ర్‌ ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో ఈ సినిమాని చివరికీ నేనే డైరెక్ట్ చేశాను. సినిమాల్లో నటించేటప్పుడే డైరెక్షన్‌లో అక్కడక్కడా మెళకువలు నేర్చుకుంటూనే ఉన్నాను. నా డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారో గమనించి డైరెక్షన్ నేర్చుకున్నాను.

 

ఫిల్మ్ మేకింగ్ గురించి తెలియడానికి, సినిమాను తెరకెక్కించడానికి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా ఫుల్ జౌట్ అండ్ ఔట్ కామెడీ అని.. గంట 53 నిమిషాలున్న ఈ సినిమాలో దాదాపు గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతూనే ఉంటామని.. సినిమాలో ఎక్కడా నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్.. ఓన్లీ కామెడీనే అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ఇక ట్రైలర్ చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుతూనే ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: