టాలీవుడ్ ఆంటీ ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు చెప్పే నీతి క‌బుర్ల‌కు అంతే ఉండ‌దు.. పొద్ద‌స్త మానం ఇండ‌స్ట్రీలో త‌ప్పొప్పుల నుంచి అన్ని మీడియా ముందు ఏక‌రువు పెడుతూనే ఉంటుంది. మ‌మ్మ‌ల‌ను మీడియా వాళ్లు అలా చూస్తారు.. ఇలా చూస్తారు... మా మీద అలా రాస్తారా ? అంటూ అంత నోరేసుకుని ప‌డిపోతూ ఉంటుంది.

 

నా మీద ఛానెల్స్ వాళ్లు అలా రాస్తున్నారు.. ఇలా రాస్తున్నారు.. యూ ట్యూబ్‌లో అన్ని నా గురించి బూతు మాట‌లే ఉంటున్నాయి... నేను ఎంత ప‌త్తిత్తునో అని చెపుతూ ఉంటుంది. సినిమాలు, వివాదాలు, మా ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లోనూ ఆమే ఉంటుంది. మ‌రి ఇన్ని నీతి క‌బుర్లు, ప‌త్తిత్తు మాట‌లు చెప్పే ఆమె ఎంత ప‌ద్ధతిగా ఉండాలి ?  ఎంత ఆద‌ర్శంగా ఉండాలి... కానీ ఆమె తెర వెన‌క చేసేవ‌న్నీ చీక‌టి ప‌నులే అన్న‌ది చాలా మందికి తెలుసు.

 

అయితే ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రూ ప‌త్తిత్తులు, ప్ర‌తివ్ర‌త‌లు కాద‌న్న‌ట్టుగా ఎవరికి వారు ఆమె నోట్లో నోరు పెట్ట‌డం ఎందుకులే బాబు అని ఊసురో మంటూ ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుంటూ వ‌చ్చారు. అయితే ఆమె చీక‌టి గుట్టు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె ఆంధ్రాలోని త‌న సొంత జిల్లా నుంచి సినిమాల్లో అమ్మాయిల‌ను ఇప్పిస్తానంటూ మైన‌ర్ బాలిక‌ల‌కు ఛాన్సులు ఎర వేస్తోంది.

 

అక్క‌డ సినిమా ఛాన్సులు.. ఇంకేముంది మీరే హీరోయిన్లు అని చెప్పి ఇక్క‌డ‌కు వ‌చ్చాక వాళ్ల‌ను ఇండ‌స్ట్రీలో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న కుర్ర హీరోలు, మీడియం రేంజ్ హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల దగ్గ‌ర‌కు పంపి వాళ్ల‌కు మైన‌ర్ల చేత ప‌క్క సుఖం పంచేలా చేస్తోంద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల ఆమెకు సినిమా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఇలా వ్య‌భిచారం చేయిస్తూ డ‌బ్బులు సంపాదిస్తోంద‌ట‌.

 

అయితే ఆమె ద‌గ్గ‌ర త‌న సొంత జిల్లా, సొంత ప్రాంతానికి చెందిన 10 మంది వ‌ర‌కు మైన‌ర్లు ఉన్నార‌ట‌. ఈ విష‌యం ఓ మైన‌ర్ బాలిక తండ్రికి తెలియ‌డంతో అత‌డు త‌న మందీ మార్బ‌లంతో హైద‌రాబాద్ వ‌చ్చి, ఆ సీనియ‌ర్ న‌టీమ‌ణి ఇంటికెళ్లి గొడ‌వ చేసి మ‌రీ వెళ్లాడు. ఇంకోసారి అమ్మాయిల జీవితాల‌తో ఆడుకోవాల‌ని చూస్తే… మామూలుగా ఉండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్లాడ‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో బాగా హైలెట్ అవుతోంది. మ‌రి ఆమె తెర‌ముందు చెప్పే నీతిక‌బుర్లు, ఈ చెత్త ప‌నులు ఎప్ప‌ట‌కి ఆపుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: