దేశంలో జరుగుతున్న అత్యాచారాల గురించి సినీ నిర్మాత, దర్శకుడిగా చెప్పుకునే డేనియల్ శ్రవణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దిశ అత్యాచార ఘటనపై నీచంగా స్పందిస్తూ అందరిచేత "ఛీ..తూ.." అనిపించుకుంటున్నాడు డేనియల్ శ్రవణ్.

తన ఫేసుబుక్ పోస్ట్ లో ఏం రాసాడంటే...

"100 కి డయల్ చేసే బదులు.. మీతో కండోమ్స్ తీసుకెళ్లండి.. కండోమ్స్ వాడి మిమల్ని మీరు రక్షించుకోండి. వందకి నా బొందకి కాల్ చేసేకంటే.. పర్సు లో కండోమ్స్ క్యారీ చేసుకొని లైఫ్ ని కాపాడుకోండి. మహిళల రక్షణ కేవలం కండోమ్స్ తోనే సాధ్యమవుతుంది. నిర్భయ చట్టం వలన కాదు. #పర్ఫెక్ట్ ఫ్లిర్టింగ్ టిప్స్#క్యారీకండోమ్స్"

మళ్ళీ ఇంకో పోస్ట్ లో ఇలా రాసాడు...

"హత్య లేని అత్యాచారాన్ని న్యాయసమ్మతం చేస్తూ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకురావాలి. (అంటే రేప్ తర్వాత చంపకుండా ఉంటారు.) మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగడానికి... సమాజం, మహిళ సంఘాలే ప్రధాన కారణం. వారి వలనే రెపిస్టులలో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. న్యాయస్థానం, ప్రభుత్వం, చట్టం అత్యాచారాన్ని నేరం కాదని చెప్తే... రేపిస్టులకు అమ్మాయిలని చంపాలనే ఆలోచనలు రావు.

'హింస లేని అత్యాచారం' లీగల్ చేస్తేనే... మనం మహిళల ఘోరమైన హత్యలను ఆపవచ్చు. రేపిస్టులు కూడా... సమాజం, కోర్ట్ లకు భయపడకుండా అత్యాచారం చేసిన తర్వాత... చంపకుండా వదిలేస్తారు. ఆడవాళ్లు అత్యాచారం చేసేప్పుడు సహకరించాలి. అత్యాచారం అనేది హత్య కంటే మంచిది. హత్య చేయడం పాపం ఇంకా.. నేరం. రేప్ అనేది పెద్ద తప్పేమి కాదు. నిర్భయ చట్టం వలన మీకు ఏమి న్యాయం జరగదు. అత్యాచారం అనేది రేపిస్టుల శారీరిక వాంఛను తీర్చేది.. లాజిక్ ఏంటంటే... ఒకవేళ అత్యచారాన్ని మహిళ సంఘాలు, సమాజం, న్యాయస్థానం సీరియస్ గా తీసుకోకుండా... దాని గురించి పట్టించుకోకపోతే... రేపిస్టులు అత్యాచారం చేసిన తర్వాత క్రూరంగా మారకపోవచ్చు...

18 సంవత్సరాలు దాటిన వారి కోసం...ప్రభుత్వం తప్పకుండా ఒక జీవో ని ఆఫర్ చేయాలి.. 'అత్యాచారం చేసిన తర్వాత చంపకండి'... లేకపోతే... 'హింస లేకుండా అత్యాచారం చేసుకోండి'..... " అంటూ వ్యాఖ్యలు చేశాడు.

దారుణనమైన పోస్ట్ ఏంటంటే.. "ఈ మొండి మహిళలు దానికి ఒప్పుకోక పోవడం వలనే... మగవాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు" అంటూ తన నికృష్ట బుద్ధిని చూపించాడు.

ఇంత అసహ్యం పుట్టించే విధంగా వ్యాఖ్యలు చేసిన శ్రవణ్ ని బాగా తిట్టిపోస్తున్నారు. యాంకర్ స్వాతి రెడ్డి బాగా మండిపడింది.

సాక్రెడ్ గేమ్స్ నటి డేనియల్ వ్యాఖ్యలకు స్పందిస్తూ... 'ఈ శ్రవణ్ ఎవరో కానీ... అతనికి చికిత్స అత్యంత అవసరము.' అంటూ ట్వీట్ చేసింది.

అందరు తిడుతుంటే... శ్రవణ్ వెంటనే అతని పోస్టులను డిలీట్ చేశాడు. "ఆ పోస్ట్ లోని వ్యాఖ్యలు నా సినిమాలోని విల్లన్ కోసం రాసినవి. తప్పుగా అర్ధం చేసుకోకండి... ఎవరైనా బాదపడి ఉంటే వారికి నా క్షమాపణలు." అంటూ అసమర్ధత ఇచ్చుకున్నాడు. కానీ అతని పోస్ట్లు మొత్తం కొంతమంది స్క్రీన్ షాట్ లు  తీసుకొని... సామజిక మాధ్యమాలలో తిడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: