ప్ర‌స్తుతం టాలీవుడ్ సినిమా మార్కెట్ బాగా పెరిగింది. ఎప్పుడు అయితే డిజిట‌ల్ మార్కెట్‌, శాటిలైట్ మార్కెట్ పెరిగిందో అప్ప‌టి నుంచి అటు హీరోల రేట్లతో పాటు సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కూడా విప‌రీతంగా పెరిగి పోయింది. ఇక ఇప్పుడు నిర్మాత‌లు కూడా ఆ మార్కెట్ల‌ను దృష్టిలో ఉంచుకునే సినిమాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నిర్మాత‌లు సైతం గ‌తంలోలా వ‌సూళ్లు రాని సందేశాత్మ‌క సినిమాలు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. 

 

ఈ క్ర‌మంలోనే చాలా మంది నిర్మాత‌లు అగ్ర హీరోల‌తో సినిమాలు చేసేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే భారీ మొత్తాలు ఇచ్చి మ‌రీ వాళ్ల కాల్షీట్లు బుక్ చేసుకుంటున్నారు. పెద్ద హీరోల‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటం కలెక్షన్లు వంద కోట్లకు పైగా ఉండటంతో వాళ్ళతో సినిమా కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత పెద్ద నిర్మాత‌లు అయినా ఇద్ద‌రు స్టార్ హీరోల పేర్లు చెపితే మాత్రం భ‌య ప‌డిపోతున్నార‌ట‌. 

 

ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రో కాదు... వాళ్ళే ప్రభాస్, మహేష్ బాబు... ప్రభాస్ మిర్చి సినిమా తర్వాత బాహుబలి సినిమా చేసాడు. ఆ రెండు సినిమాల మార్కెట్‌ను బ‌లుపు అనుకుని సాహో చేస్తే అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు మ‌నోడు అడిగిన రెమ్యున‌రేష‌న్ ఇచ్చి అత‌డితో సినిమా చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాని పరిస్థితి. ఇక మ‌హేష్‌బాబు ఒక్కో సినిమాకు ఏకంగా 18 నెల‌ల టైం తీసుకుంటున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ముందు ఇచ్చిన అడ్వాన్స్‌లు, వ‌డ్డీలు క‌లుపుకుంటే బ‌డ్జెట్ త‌డిసి మోపెడు అవుతోంది.

 

అందులోనూ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంతా త‌న‌కే ఇచ్చాయ‌ల‌న్న కండీష‌న్లు మ‌హేష్ పెడుతుండ‌డంతో నిర్మాత‌ల‌కు చుక్క‌లే క‌న‌ప‌డుతున్నాయ‌ట‌. అందుకే ఐదారు నెల‌ల్లో ఫినిష్ అయ్యేలా చిన్న హీరోలు అయిన‌ నాని, శర్వానంద్ వంటి హీరోల మీద దృష్టి పెడుతున్నారట నిర్మాతలు. వీళ్లతో సినిమా అంటే ఐదారు నెల‌ల్లో రిలీజ్ కూడా అయిపోతోంది. హిట్ అయితే భారీ లాభాలు.. ప్లాప్ అయినా పెద్ద‌గా న‌ష్టాలు కూడా ఉండ‌వు..!

మరింత సమాచారం తెలుసుకోండి: