బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోల్లో అక్షయ్ కుమార్ చేసినన్ని సినిమాలు ఎవరూ చేయట్లేదు. పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేయడానికే కష్టపడుతుంటే అక్షయ్ మాత్రం దానికి భిన్నంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆయన నుండి మూడు సినిమాలు విడుదల అయ్యాయి. మరో సినిమా డిసెంబర్ 27 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

 

మన సినిమాలు ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయితే వాటిని వేరే దేశాల్లో కూడా విడుదల చేస్తుంటారు. అలా చాలా సినిమాలు వేరే భాషల్లోకి వెళ్ళాయి. అలా చైనీస్ భాషలోకి అక్షయ్ కుమార్ సినిమా వెళ్లనుంది. అక్షయ్ కుమార్ నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా గోల్డ్. భారతీయుల జాతీయ క్రీడైన హాకీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అక్షయ్ కుమార్ తపన్ దాస్ అనే హాకీ జట్టు అసిస్టెంట్ మేనేజర్ పాత్ర చేశారు. 

 


1936లో బెర్లిన్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రానికి  రీమా కంగ్టి దర్శకత్వం వహించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకోవడమే కాక  విమర్శల నుండి ప్రశంశలని అందుకుంది. కాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈనెల 13న భారీ ఎత్తున గోల్డ్ మూవీ చైనీస్ వర్షన్ అక్కడ విడుదల చేస్తున్నారు ఈ ఏడాది చైనాలో విడుదల అవుతున్న అక్షయ్ కుమార్ రెండవ చిత్రం ఇది.

 

రోబో 2.o సినిమా కూడా ఈ ఏడాదే విడుదలైంది. మరి ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా చూడాలి.  అదలా ఉంచితే అక్షయ్ ఈ ఏదాది నటించిన నాలుగవ సినిమాఅ గుడ్ న్యూస్ డిసెంబరు ౨౭ వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: