బాలీవుడ్లో హిట్ మీద హిట్ లో సాధిస్తున్న పెద్ద హీరో ఎవరంటే ఠక్కున వచ్చే పేరు అక్షయ్ కుమార్. మొదట ఇండస్ట్రీకి స్టంట్ మెన్ గా పరిచయమై హీరోగా అనతి కాలంలోనే తన నటనా ప్రతిభతో అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అతి తక్కువ సమయంలో సినిమాను కంప్లీట్ చేసి అలాగే మినిమం గ్యారంటీ సినిమాలు తీసే హీరోగా మంచి పేరు పొందాడు అక్షయ్ కుమార్.

 

అన్నీ తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు మాస్ కు పెద్దగా కనెక్ట్ కాని సినిమాలతో అక్షయ్ కెరీర్ సాగుతూ ఉంది. ఆయన ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో కనిపించాడు అలాగే మూడు చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించాయి. అలాగే వచ్చే నెలలో డిసెంబర్ నెలలో కరీనాకపూర్ తో ''గుడ్ న్యూస్" అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో అతను ఒక అరుదైన లక్ష్యంతో వస్తున్నాడు. ఒకే సంవత్సరంలో ఇండియాలో 1000 కోట్లు సంపాదించిన హీరోగా రికార్డులోకి ఎక్కాలి అని చూస్తున్నాడు.

 

 ఇప్పుడు ఈ హీరో కొన్ని సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఈయన రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్య వంశి అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సౌత్ లో భారీ హిట్ సాధించిన కాంచన సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు.

 

సినిమా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఒక ఇంటర్వ్యూలో, మీరు ఎందుకు పెద్ద సినిమాలు చేయడం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. నాకు బాలీవుడ్లో పెద్ద దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. పెద్ద డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లనే నేను చిన్న డైరెక్టర్లతో సినిమా చేస్తున్నానని అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: