టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ  వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమా అదేవిధంగా నిర్మాతగా నిర్మించిన సినిమా రెండు ప్లాపు కావడంతో విజయ్ దేవరకొండ ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటూ తన క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చేసుకోవటానికి ప్యాన్ ఇండియా కాన్సెప్టు లాగా చేసిన సినిమాలు విడుదలయ్యేలా  విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ మరియు మెగాస్టార్ చిరంజీవి ప్యాన్ ఇండియా కాన్సెప్టు టైపు లో సినిమాలు విడుదల చేయడం జరిగింది. ఇదే దారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరి కొంత మంది స్టార్ హీరోలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఫైటర్ సినిమాతో ప్యాన్ ఇండియా కాన్సెప్టు ఈ సినిమాని విడుదల చేయాలని సినిమా యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌత్ ఇండియా లో తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ...పూరి జగన్నాథ్ సినిమాతో బాలీవుడ్లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆశ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ‘ఇస్మార్ట్ శంకర్‌’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమాలో విజయ్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొ డతాననే నమ్మకంతో  ఉన్నారని టాక్. పదాలు సరిగా పలకలేని వ్యక్తి, జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు. తనకు ఎదురయ్యే సమస్యలపై ఫైటర్ గా నిలిచి ఎలా గెలుపు సాధిస్తాడు అనే పాత్రలో నటించనున్నాడని టాక్. దీంతో ఈ సినిమాని ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ వున్నట్లు సమాచారం. మొత్తం మీద పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ నటించబోయే ఫైటర్ సినిమా సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలనే ఆలోచనలో అదిరిపోయే ప్లాన్ లో విజయ్ దేవరకొండ ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: