మన సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీస్ కొందరు డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు ఉన్నారు. అలాగే కొంతమంది ఇంజినీర్ కాబోయి డైరెక్టర్ అయిన వాళ్లను చూసాం. కానీ..వింతగా సన్నాసిని కాబోయి గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ ని ఇప్పటివరకు ఎక్కడైనా చూశారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. కానీ మన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోయిన్ ఉందన్న విషయం ఎవరికీ తెలీదిఉ. అవును సల్మాన్ సరసన నటించిన జాక్విలిన్ ఫెర్నాండస్. రీసెంట్‌గా ప్రభాస్ నటించిన సాహో సినిమాలో ఒక్క 'బ్యాడ్ బోయ్స్'..అనే స్పెషల్ సాంగ్ తో యూత్ ను విపరీతంగా ఆకట్టున్న ఈ బ్యూటీ గతం పరిశీలిస్తే ఊహించని షాక్ కి గురి కావాల్సిందే. 

 

అసలు సన్యాసినులు తిరిగే చోట స్తోత్రం అంటూ ప్రార్ధనలు జరిపే చోట పెరిగిన ఈ శ్రీలంక బ్యూటి ఉన్నట్టుండి కుర్రకారు చూపులకి లాకయిపోయి మనసు అదుపు తప్పిందట. ఈ సంగతిని జాకీనే స్వయంగా ఫేమస్ నేహా ధూపియా చాట్ షోలో చెప్పింది. సన్నాసిని అయ్యే క్రమంలోనే ఒకసారి చూపు కుర్రాళ్ళ వైపు మళ్ళిందట. అంతే ఆ తర్వాత క్రష్ లు.. ప్రేమలు వగైరా వగైరా పుట్టుకొచ్చాయిట. దాంతో తాను నన్ కాలేకపోయానని వాపోయింది. 

 

జాకీ కాన్వెంట్ స్కూలింగ్ అంతా నన్స్ తోనే. ప్రతిరోజూ చర్చిలో ప్రార్థనలు చేసేదానిని. జీవితంలో బోలెడంత గాస్పెల్ స్టఫ్ ఉందిలే! అంటూ జాకీ చెప్పుకొచ్చింది. ఈ డ్యాన్సులు.. యాక్టింగ్ పిచ్చి మొదలయ్యాకే అవన్నీ పోయాయని.. ఎప్పుడైతే బోయ్స్ వైపు మనసు మళ్లిందో క్రష్ మొదలైందో అప్పుడు తనలోని నన్ ఎగిరిపోయిందని జాకీ చెప్పి షాకిచ్చింది. ఒకవేళ జాక్విలిన్ నన్ అయ్యి ఉంటే ఈరోజు బాలీవుడ్ లో ఇంత క్రేజ్ ని.. కుర్రాళ్ల కామెంట్స్..ఇలా చాలా మిస్సయిపోయి ఉండేది. అయితే కొంతమంది కుర్రాళ్ళు మరి సన్యాసిని అవ్వాలునున్నదానివి బికిని వేసుకొని మమ్మలిని ఎందుకు రెచ్చగొట్టి చంపావు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.  ఇక జాక్విలిన్.. హౌజ్ ఫుల్ సిరీస్, మర్డర్ 2, కిక్, భాగీ, జుడ్వా, రేస్ సిరీస్..వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: