ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సినిమా పరిశ్రమల ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే సినిమాల్లో బాండ్ సిరీస్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఇప్పటివరకు బాండ్ సిరీస్ లో వచ్చిన 24 సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రేక్షలను కూడా ఎంతో అలరించాయి అనే చెప్పాలి. ఇక దాదాపుగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన బాండ్ 25వ సిరీస్ సినిమా అయిన 'నో టైం టు డై' అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ని సినిమా యూనిట్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. 

 

గతంలో వరుసగా నాలుగు బాండ్ సినిమాలైన క్వాంటమ్ ఆఫ్ సొలెస్, క్యాసినో రాయల్, స్కై ఫాల్, స్పెక్ట్రీ సినిమాల్లో బాండ్ గా నటించి ఆడియన్స్ నుండి మంచి పేరు సంపాదించిన డ్యానియల్ క్రెయిగ్, మరొక్కసారిగా ఈ సిల్వర్ జూబిలీ సినిమాలో కూడా బాండ్ గా నటించడం జరిగింది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే, ఈ సినిమా తప్పకుండా యాక్షన్ ప్రియులని, ముఖ్యంగా బాండ్ సినిమాలను ఎంతో ఇష్టపడే ప్రేక్షకులని బాగా మెప్పిస్తుందని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ఛేజింగ్ సన్నివేశాలు కూడా ఎంతో అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా కారు ఫ్రంట్ లైట్స్ నుండి స్టన్ గన్ బయటకు రాగా, 

 

దానితో విలన్లను జేమ్స్ బాండ్ పేల్చే సన్నివేశం, మొత్తం ట్రైలర్ లో ఎంతో ఆకట్టుకునే సీన్ అని చెప్పాలి. గతంలో మాదిరిగా ఈ సినిమా కూడా మంచి ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కినట్లు చెప్తున్నారు. మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బార్బరా బ్రొకోలి, మైఖేల్ జి విల్సన్ ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మించారు. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్యారీ జోజి ఫ్యూకునాగా దర్శకత్వం వహించడం జరిగింది. కాగా ఈ సినిమా 2020 ఏప్రిల్ లో ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ట్రైలర్ పై ఒక లుక్ వేయండి....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: