సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాల గురించి తెలిసిందే. ఇక్కడ పబ్లిసిటీ చేసుకోవడం ఎంత ఈజీనో ప్రమాదాలు అంతే సీక్రెట్ గా జరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఫేక్ ఐడీలతో నానా రచ్చ చేసే గ్యాంగ్ లు పుట్ట గొడుగుల్ల పుట్టుకు రావడంతో అది ఎన్నో ప్రమాదాలకు తెరతీస్తోంది. అందుకే వరుసగా దారుణాతి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక పాపులర్ సెలబ్రిటీ పేరును వాడుకుని ఐడీ క్రియేట్ చేయడం అక్కడ నగ్న ఫోటోలు షేర్ చేయడం.. వాటితో సంపాదనా మార్గం వెతకడం.. ఇలాంటి ఫేక్ బాబులు నీచంగా తయారవుతున్నారు. సెలబ్రిటీల క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడడం ఈ ఫేక్ ఐడీల స్ట్రాటజీ. ఇలాంటి ఫేక్ పై ఇప్పుడు సైబర్ పంజా విసురుతోంది. సాంకేతికత పెనుపోకడలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చాలా రకాల ఆపరేషన్స్ చెస్తున్నారు.

 

ఇంతకుముందు పలువురు నటీమణుల న్యూడ్ ఫోటోలు .. ఫేక్ వీడియోలు రిలీజై అవి కాస్తా నెటిజనుల్లో వైరల్ అయ్యాయి. అవి నిజమేనని నమ్మేసిన అమాయక జనం కోకొల్లలు. అయితే అవన్నీ ఫేక్ ఐడీల నుంచి వైరల్ అయినవి అన్నది తెలిసింది మాత్రం కొంతమందికే. ఇక స్టార్ హీరోయిన్.. స్టార్ హీరో రేంజు వారికి సొంతంగా కొన్ని ఐడీలు ఉంటాయి. అవి అభిమానులు గుర్తు పట్టేలా ఉంటాయి. అయితే నవతరం నాయికలకు .. నటీమణులకు ఇలాంటివి ఉండకపోవడంతో ఇక్కడ ఘోరంగా వాళ్ళే బుక్కవుతున్నారు.

 

జోకర్ ఫేం తమిళ నటి రమ్య పాండ్యన్ ఫేక్ బారిన పడింది. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన ఆకతాయిలు హద్దు మీరి నగ్న ఫోటోని షేర్ చేశారు. బ్యాక్ ఫోజులో సెమీ న్యూడ్ ఫోటో వైరల్ గా మారింది. ఇది రమ్య పాండ్యన్ అకౌంట్ నుంచి షేర్ చేయడంతో అది కాస్తా జెట్ స్పీడ్ తో వాట్సాపుల్లోనూ వైరల్ అయ్యింది. అయితే అది కాస్తా రమ్యకు తెలిసేసరికి అప్పటికే వైరల్ అయిపోయింది. దీంతో ఆవేదన చెందిన నటి రమ్య సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిందట. అలాగే తన ఒరిజినల్ ఐడీల్ని కూడా అభిమానులకు తెలియజేసిందట రమ్య.   

మరింత సమాచారం తెలుసుకోండి: