వివాదాల దర్శకుడు ఆర్జీవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సారు దగ్గర ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ సెన్సారు బోర్డు దగ్గర మన వర్మకి గట్టి షాక్ పడింది. ఈ సినిమాకు సెన్సారు ఇవ్వాలంటే దాదాపు 90 కట్ లు చెప్పాల్సి వస్తుందట, అందుకే సెన్సారు ఇవ్వలేమని, రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేసారు. రివైజింగ్ కమిటీ కి అప్లయి్ చేసారు. వాళ్లు ఓకె అని చూస్తామంటే, సినిమా చూపించాలి. లేదంటే లేదు. ఇదిలా వుంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇటు తెలుగుదేశానికి వ్యతిరేకంగా, అటు వైకాపాకు అనుకూలంగా వుంటుందని ఇన్నాళ్లు అందరు నోటా వినిపిస్తున్న మాటలు. అలాగే టైటిల్ ను బట్టి కాస్త కమ్మ సామాజిక వర్గాన్ని కించపరచే సీన్స్ వుంటాయని చెప్పుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో తాజా పరిణామాలను బట్టి వినిపిస్తున్న మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.  సినిమాలో రాజకీయ వ్యవహారాలకు దీటుగా కులాల వ్యవహారాలు కూడా వున్నాయట. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేసి, మరో సామాజిక వర్గాన్ని బాగా హైలైట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. సినిమాకు సర్టిఫికెట్ రాకపోవడానికి కారణాల్లో ఇదే అసలు కారణమని లేట్సెట్ న్యూస్. 

 

అయితే ఆర్జీవీ ముందు జాగ్రత్తగా చాలా సీన్లకు రెండు వెర్షన్లు రెడీచేసి వుంచినట్లు మరో షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అవసరమనుకుంటే వాటిని, వీటిని క్లబ్ చేసి రెండో వెర్షన్ రెడీ చేయడానికి కూడా పక్క ప్లాన్ లో ఉన్నాడని తాజా సమాచారం. మరి వర్మ ఎత్తుగడలు ఎంతవరకు పని చేస్తాయో చూడాలి. అసలే ఈ మధ్య వర్మ మ్యాజిక్ అసలు పనిచేయడం లేదు. వరుసగా ఫ్లాపులను మూటగట్టుకుంటున్నాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎంతో కాంట్రవర్సీ టైటిల్ పెట్టి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని తీసిన ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడేమో ఈ సినిమాకి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే వర్మ అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు ఇంకా మొదలవనే లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: