మంచి అభిరుచి గల నిర్మాతగా రాజ్ కందుకూరి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే ఆయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు చాలానే ఊహించుకుంటారు. అయితే ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీస్ లో అంత కొత్తదనం ఏముంటుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా ఇదే మాట వినిపిస్తోంది. ప్రేమ అంటే అంతే కలిసి వుంటే మధురంగా వుంటుంది..విడిపోతే అంతకు అంతా బాధపెడుతుంది. కుర్రకారు లవ్ స్టోరీ అంటే కొత్తగా ఏముంటుంది.

 

జీవితంలో ప్రతి రంగంలో ఫెయిల్యూర్ లు చవిచూసిన హీరో కథ ఇది అని తెలుస్తోంది. కొత్త దర్శకులు, కొత్త ఐడియాలతో వస్తున్న ప్రస్తుత రోజుల్లో ఈ ట్రైలర్ చూస్తుంటే బాగా రొటీన్ గా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ సతాయింపు, చదువు మీద కన్నా తన ఆసక్తి మీద తపన, కాలేజీలో పరిచయం, మనసులు కలిసినా, అభిప్రాయాలు తేడా, బ్రేకప్, ఆపై మళ్లీ మరో పరిచయం. ఈసారి పూర్తిగా కాంట్రాస్ట్ వ్యవహారం. ఇలా ట్రయిలర్ మొత్తం, కొత్త దనం లేకుండా, అలవాటైపోయిన సినిమా కథలని చాలానే గుర్తు చేసింది. దీంతో ఇది రాజ్ కందుకూరి సినిమానేనా..అందులో ఆయన కొడుకేనా హీరో అంటు అనుమానాలు మొదలైయ్యాయి. 

 

పరిచయం..ప్రేమ..విరహం..వేదన..ఫ్రస్టేషన్..అంతేగా.. తాజా గా విడుదలయిన 'చూసీ చూడంగానే' సినిమా ట్రైలర్ ఇదే అర్థమవుతోంది. ఓస్ ఇదేనా ఈసినిమా కథ అంటూ పెదవి విరుస్తున్నారు. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'చూసీ చూడంగానే'. కొత్త దర్శకుడు శేష సింధు అందిస్తున్న కథ,కథనం, మాటలతో ఈసినిమా తెరకెక్కుతోంది. వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రయిలర్ లో మొదలైన డైలాగులు కూడా అంత కొత్తగా అనిపించలేదు. 'సిద్దూ నువ్వు ఇది వరకు లా లేవు...నువ్వు చెప్పినట్లే వున్నానుగా..మ్యూజిక్ నాకు లైఫ్..ఇలా డైలాగులు అన్నీ కూడా ఇది పరమ రొటీన్ సినిమా అని చెప్పకనే చెబుతున్నాయి. 

 

రాజ్ కందుకూరి.. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి భిన్నమైన సినిమాలు అందించి మంచి అభిరుచి వున్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన తన కొడుకు కోసం యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ లో ఏదో సమ్ థింగ్ వుంటుందనుకుంటే ఇలా ఉందేంటి..అని ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ట్రైలర్ కట్ చేయడంలో పొరపాటా..లేక సినిమా కథే ఇలా ఉంటుందా అన్నది చూస్తే గాని తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: