గత రెండేళ్ళుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సూపర్ హిట్స్ అందుకొని తన మార్కెట్ ని బాగా పెంచుకున్నాడు. ఈ రెండేళ్ళలో అక్షయ్ చేసినన్ని సినిమాలు అందుకున్న హిట్స్ మరే బాలీవుడ్ హీరోకి దక్కలేదు. అంతేకాదు మాస్ కథలకోసం వెంపర్లాడకుండా కంప్లీట్ గా సామాజిక అంశంతో కూడుకున్న కథలను సెలెక్ట్ చేసుకొని సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సడన్ గాఈ సక్సస్ ఫుల్ హీరో చాలా డిసప్పాయింట్ అయి సంచలన ప్రకటన చేశాడు. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ వైవిధ్యభరితమైన సినిమాలే చేస్తున్నాడు. అయితే అవన్నీ కూడా చిన్న సినిమాలు కావడం గమనార్హం! అన్నీ తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు మాస్ కు పెద్దగా కనెక్ట్ కాని సినిమాలతో అక్షయ్ కెరీర్ సాగుతూ ఉంది. అయితే అలాగని అతడి సినిమాలు వసూళ్లు సాధించడం లేదని కాదు.

 

పెద్దగా హడావుడి లేకుండా వచ్చి.. వంద కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధిస్తున్నాయి అక్షయ్ కుమార్ సినిమాలు. ప్రస్తుతానికి అయితే  ఆ హీరో బిజీగానే ఉన్నాడు. సౌత్ లో హిట్ అయిన 'కాంచన' సినిమాను అక్షయ్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఉన్నాడు. లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కియారా అద్వాని అక్షయ్ సరసన నటిస్తోంది. ఈ నేపథ్యంలో బడా బడ్జెట్ సినిమాల్లో ఎందుకు చేయడం లేదంటూ మీడియా అక్షయ్ ను అడగగా ఆయన ఆసక్తిదాయకమైనవే కాదు సంచలన వ్యాఖ్యలను చేశారు. 'నాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వడం లేదు..' అని అక్షయ్ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టాడు.

 

'పెద్ద డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వడం లేదు అందుకే చిన్న డైరెక్టర్ల సినిమాల్లో చేస్తున్నా..' అని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి వయసు మీద పడిందని అక్షయ్ కు వాళ్లు ఛాన్సులు  ఇవ్వడం లేదా..మరేదైనా రీజన్ ఉందా.. అనే విషయాల గురించి అక్షయ్ స్పందించలేదు. తనకు వారు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే అంశంపై ఆయన కామెంట్ చేయలేదు! మరి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఎందుకు అక్షయ్ కి ఛాన్సులు ఇవ్వడం లేదో ఎవరైనా స్పందిస్తే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: