నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలను  బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ... మరో వైపు రాజకీయాలను కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక నందమూరి బాలకృష్ణ కి అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా  ఉంది. నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే పవర్ ఫుల్ డైలాగులు... ఫుల్ హీరోయిజం  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో సినిమాలు తీసి విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నట్లు సమాచారం. 

 

 

 

కాగా దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతకుముందు నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేర్ చేసాయి. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. కాగా  ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రానికి మిరియాల రవీంద్ర రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో నగరి ఎమ్మెల్యే రోజా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే నందమూరి బాలకృష్ణ రోజా ఇద్దరు వేర్వేరు పార్టీలు అయినప్పటికీ కూడా రోజా ఈ సినిమాలో పాత్ర నచ్చి నటించేందుకు ఒప్పుకున్నట్లు రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. బాలయ్య సినిమాలో  విలన్ పాత్రలో రోజా నటించబోతుందని గతంలో వార్తలు రాగా...  ప్రస్తుతం మాత్రం. వేర్వేరు పార్టీలో ఉండడంతో... బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవట్లేదు అని సమాచారం. అయితే నగరి  ఎమ్మెల్యేగా ఉన్న రోజా కేవలం బాలయ్య సినిమాల్లోనే కాదు అసలు సినిమాల్లో కి రావద్దు అని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు నెగిటివ్ క్యారెక్టర్   అవసరం లేదని రోజా తేల్చి  చెప్పినట్లు సమాచారం. .

మరింత సమాచారం తెలుసుకోండి: