సందీప్‌ (అర్జున్‌రెడ్డి), ప్రవీణ్‌ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత),  మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌), నీలకంఠ (మిస్సమ్మ),ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా,  గౌతం (జెర్సీ), తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు)  వెన్నెల కిశోర్‌ (జఫ్పా),...సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు చాలా మంది తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. వీరు చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్‌ అవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్‌ సత్తారు  సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు.

 

మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సందీప్‌ అర్జున్‌రెడ్డి సినిమాతో  చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. మొదట్లో వెన్నెల కిశోర్‌ సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో  తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు  జేజేలు పలుకుతోంది.  

 

యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని మాట్లాడుతూ ...మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి . 14 ఏళ్లుగా  హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్‌. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా.  శ్రీహర్ష మందా మాట్లాడుతూ ...మాది విజయవాడ. నేను ఎంటెక్‌ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్‌  నాకు బాగా పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని.  

 

ఫిలింనగర్‌లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు.ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమాఈ చిత్రం  నాకు మంచి పేరు తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: