అడిగినంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే తెర నిండుగా తమ అందాల్ని ఆరబోసేందుకు కొందరు హాట్ హీరోయిన్స్ వెనకాడలేదు. అలాంటి వాళ్ళ్కి సరైన ఆఫర్స్ లేకపోయినా డిమాండ్ ఇలానే ఉంటుంది. అయితే ఎంతగా ఆఫర్స్ లేకపోయినా కట్టుబాట్లకు కట్టుబడి సరిహద్దులు దాటకుండా ఉండాలని మనసుకు నచ్చిందే చేయాలని మనకి నచ్చినట్టే ఉండాలనుకునే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. పూర్తిగా వలువలు వదిలి అందాల్ని పందేరం పెట్టేయడానికి ససేమిరా అనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేసినా, టూపీస్ బికినీలు వేసినా మరీ హద్దు మీరిందేమీ లేదు.

 

అటు బాలీవుడ్ లో అయితే కాస్తంత పట్టువిడుపు ఎక్కువే. అక్కడ హీరోయిన్స్ ఆరబోత పిచ్చ పీక్స్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బికినీలు, టూపీస్ లలో జనాలకి హీటెక్కడానికి ఏమాత్రం మొహమాట పడని నర్గీస్ ఫక్రి తాజాగా తనకు వచ్చిన ఓ ఆఫర్ గురించి చెప్పి పెద్ద షాకిచ్చింది. ప్రఖ్యాత ప్లేబోయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా కనిపిస్తే కోట్లాది రూపాయల్ని తన ఓడిలో గుమ్మరించడానికి సదరు మ్యాగజైన్ ప్రతినిధులు తనని సంప్రదించారట. అయితే అందుకు ససేమిరా అనేసిందట. తనకంటూ ఉన్న నిబంధనల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరికి చెమటలు పట్టించింది. 

 

తెరపై అయినా అందాల్ని ఆరబోయడానికి తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని న్యూడ్ గా కనిపించేందుకు తను ఎంతమాత్రం రెడీగా లేనని చెప్పింది నర్గీస్. ఇక భారతీయ నటీమణుల్లో ఒక్క షెర్లిన్ చోప్రా మినహా ఏ బ్యూటి కూడా ఇప్పటివరకూ మ్యాగజైన్ల కోసం నగ్నంగా అందాల్ని ఆరబోసింది లేదు. సెమీ న్యూడ్ గా కనిపించిన సందర్భాలున్నాయి తప్ప. కానీ ప్లేబోయ్ లాంటి హీటెక్కించే కవర్ పేజీపై వేరొక బాలీవుడ్ భామ ఎవరూ కనిపించిందేమీ లేదు. ప్రస్తుతం నర్గీస్ కెరీర్ అంతంత మాత్రమే. ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: