సినిమా ఇండస్ట్రీ లో ప్రేక్షకులు మెచ్చేది డాన్స్.. అదిలేదంటే సినిమానే వేస్ట్ అని ఫీల్ అవుతారు ప్రేక్షకులు. మన టాలీవుడ్ లో డాన్స్ వేసే వాళ్ళు చాలా మంది హీరోలు ఉన్నారు.. వాళ్లలో టాప్ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అల్లుఅర్జున్ డాన్స్ ని ఇరగదీస్తారు. ఒకళ్ళు బాగా వేస్తారు అనికాకుండా ఎవరి  స్టైల్లో వాళ్ళు వేసి ప్రేక్షకులను మెప్పిస్తారు. అయితే మీకు అవికాగోర్ గుర్తు ఉందా?

   చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటించింది.అలానే రాజ్ తరుణ్ తో ఉయ్యాలా జంపాల లో నటించింది.అలాగే కొన్ని సినిమాలు చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇపుడు రాజుగారి గది 3 తో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో అవికాగోర్ ని ఒక విలేఖరుడు మీకు అల్లు అర్జున్ తో డాన్స్ చేసే అవకాశం వస్తే ఏమి చేస్తారు? అని అడిగారట. కాని దానికి ఈ చిన్నారి పెళ్లికూతురు "వామ్మో..... అల్లు అర్జున్ తో డాన్స్ చేసి కాళ్ళు విరగొట్టుకోమంటారా? అని అనేసిందట నవ్వుతూ.. అల్లు అర్జున్ అభిమానిని నేను. బన్నీ తో డాన్స్ చేయాలంటే చాలా కష్టం అని అందట. 


అవును నిజమే బన్నీ ప్రతి సినిమాకి ఎదో ఒక కొత్త ప్రయోగం చేస్తూనే ఉంటాడు డాన్స్ విషయములో !సినిమా లో తన పక్కన డాన్స్ చేయాలంటే హీరోయిన్స్ కొంచెం భయపడుతూనే ఉంటారు.. తమన్నా మాత్రం బన్నీతో పాటు కలిపి డాన్స్ ఇరగదీస్తోంది.. అల్లుఅర్జున్ అసలు రిహార్సిల్ చేయకుండా డైరెక్ట్ సెట్స్ లో డాన్స్ చేస్తాడట. తన దయినా డాన్స్ తో కొత్త కొత్త మాస్ స్టెప్స్ తో ఇరగదీస్తాడు. అవికాగోర్ అన్న మాటాలకి అదేనండి బన్నీ తో డాన్స్ కష్టం, కాళ్ళు విరగొట్టుకోవాలి అని !

  ఆ మాటలకి బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట. నిజమేకదా బన్నీ తో డాన్స్ అంటే ఏ  హీరోయిన్స్ కి అయినా కష్టమే. అంతలా డాన్స్ వేసి, అవికాగోర్ నే కాదు, ప్రేక్షకులని కూడా మెప్పిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: