టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాల అత్యద్భుత విజయాల తరువాత ఇతర దేశాల సినిమా పరిశ్రమలు సైతం మన టాలీవుడ్ పై చూడ సాగాయి. హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడివి శేష్, విలన్ గా నటించినా రానా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రెండు సినిమాల్లోని ప్రతి ఒక్క పాత్ర కూడా ఆడియన్స్ మదిలో ఎంతో గుర్తుండిపోయింది. ఇక మొదటి భాగాన్ని మించి రెండవ భాగం మరింత అద్భుతంగా ఆడడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల వరకు కలెక్షన్ ని రాబట్టింది. 

 

అయితే నిన్న ఈ సినిమాకు యాహూ ఇండియా వారి నుండి ఘోర అవమానం ఎదురైంది. వివరాల్లోకి వెళితే, యాహూ ఇండియా వారు ఈ దశాబ్దంలో రిలీజ్ అయిన బెస్ట్ సినిమాల రివ్యూ లో భాగంగా పలు బాలీవుడ్ సినిమాలను చేర్చడం జరిగింది. వీటిలో అమీర్ ఖాన్ దంగల్, సల్మాన్ ఖాన్ భజరంగి భాయి జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై సహా పలు ఇతర బాలీవుడ్ సినిమాలు వరుసలో నిలిచాయి. ఇక వీటన్నిటిలో ఆడియన్స్ పోల్ ద్వారా అత్యధిక రేటింగ్స్ సంపాదించి దంగల్ సినిమా ప్రధమ స్థానాన్ని కైవశం చేసుకుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ లిస్టులో అసలు బాహుబలి 2 ఊసే లేకపోవడం. దంగల్ కు దాదాపుగా సమానంగా మన బాహుబలి 2 కలెక్షన్ రాబట్టింది. అయితే ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఒకింత ఎక్కువ రాబట్టింది. 

 

ఇక ఇండియా వైస్ గా చూసుకుంటే, బాహుబలి 2 సినిమా దంగల్ కంటే కూడా అత్యధిక కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలుస్తుంది. మరి అటువంటి సినిమాని కనీసం లిస్ట్ లో కూడా చేర్చకపోవడంతో సౌత్ ప్రేక్షకులు యాహు సంస్థపై పలు విధాలుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అంతటి అత్యద్భుత చిత్ర రాజాన్ని లిస్ట్ లో చేర్చకపోవడం సౌత్ సినిమాలను అవమానించడమేనని, ఇది కావాలనే బాలీవుడ్ సినిమాల వారు పన్నుతున్న కుట్ర అని పలువురు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: