గత ఏడాది ప్రారంభంలో ఛలో తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగ శౌర్య ఆతరువాత హ్యాట్రిక్ డిజాస్టర్లును చవి చూసాడు. అయితే జయాపజయాలతో సంబందం లేకుండా ఈ హీరో వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీగా వున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్ లో 'అశ్వథ్థామ'
అనే చిత్రంలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈచిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు ఈహీరో. అందుకోసం జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. అందులో భాగంగా జిమ్ లో తీసుకున్న ఫోటో ను శౌర్య తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. సిక్స్ ప్యాక్ లుక్ తో వున్న ఈఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మిస్తున్నఈ చిత్రం లో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం తో తోపాటు తనకు ఊహలు గుస గుస లాడే లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో శౌర్య మరో సినిమా చేయాల్సి ఉండగా నూతన దర్శకురాలు
లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో కూడా నటించడానికి శౌర్య ఓకే చెప్పాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఈ రెండు సినిమాల తోపాటు ఇటీవల మరో కొత్త చిత్రానికి కూడాసైన్ చేశాడు నాగశౌర్య. సుబ్రహ్మణ్యపురం ఫేమ్
సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో నటించడానికి నాగశౌర్య ఓకే చెప్పాడు. ఏషియన్ సినిమాస్ అధినేత
సునీల్ నారంగ్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత
శరత్ మరార్ సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈనాలుగు సినిమాలు నాగశౌర్య కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.