షకీలా.. ఒకప్పుడు దక్షిణాదిని ఊపేసిన సెక్స్ బాంబ్.. షకీలా సినిమా వస్తుందంటే చాలు.. అగ్రహీరోలు కూడా తమ సినిమాల డేట్లు మార్చుకునే వారంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో వెలిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంత క్రేజ్ అయినా కొన్నాళ్లే కదా.. ఇప్పుడు షకీలా దగ్గర అంత సీన్ లేదు.. అలాగే ఇప్పుడు అలాంటి సెమీ పోర్న్ సినిమాలకు అంతగా డిమాండ్ లేదు.

 

ఏకంగా చేతిలోకి సెల్ వచ్చేశాక.. శృంగార దృశ్యాల కోసం సినిమా థియేటర్ కు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. అందుకే షకీలా ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవల ఆమె ఓ అడల్ట్ మూవీ నిర్మించింది. పేరు లేడీస్ నాట్ అలవ్డ్.. అయితే ఈ సినిమా పూర్తయి చాన్నాళ్లయినా సెన్సార్ వారు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అంతేకాదు.. ఏకంగాఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు.

 

దీంతో షకీలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులపై అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండుసార్లు సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు తిరస్కరించారు. అయితే.. ఈ చిత్రానికి సెన్సార్‌ పూర్తి చేయడానికి కొందరు డబ్బులు అడుగుతున్నారంటోంది షకీలా. తన చిత్రాన్ని తిరస్కరించడానికి గల కారణమేమిటని సెన్సార్‌ బోర్డు సభ్యులను నిలదీస్తోందామె.

 

అంతే కాదు.. చిన్న నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతారా? పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్లని మీరు డబ్బులు అడగరు. నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. వాటిని బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ‘లేడీస్‌ నాట్‌ అలవ్డ్‌’ ఫ్యామిలీ చిత్రం కాదని, ఇదొక అడల్ట్‌ కామెడీ సినిమా అని మేమే చెప్పాం. అంటోందామె. అసలు ఈ సినిమాను తిరస్కరించడానికి కారణమేమిటో నాకు అర్థం కావడంలేదు. ఈ జోనర్‌లో వచ్చిన ఎన్నో చిత్రాలకు సెన్సార్‌ ఇచ్చారు. కానీ మా చిత్రానికి మాత్రమే సెన్సార్‌ ఇవ్వడం లేదు.. అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: