సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో వచ్చే మజానే వేరుగా ఉంటుంది. సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది.. ప్రేక్షకులకు రిలీఫ్ ఉంటుంది. సినిమా సక్సెస్ రేట్లో ఐటమ్ సాంగ్ వాల్యూ ఇది. ఐటమ్ సాంగ్స్ తీయడంలో టాప్ డైరక్టర్ పూరి జగన్నాధ్ సిద్ధహస్తుడనే చెప్పాలి. పోకిరిలో ముమైత్ ఖాన్ చేత ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అని డ్యాన్సులు చేయించి ఆమెను స్టార్ గా మార్చేశాడు. ఇప్పుడు తన కొడుకు హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్ లో ఓ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడు. ఇందుకు ఓ క్రేజీ స్టార్ ను తీసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

 

 

క్రేజీ స్టార్ అంటే రేసులో ఉన్న హీరోయిన్ కాదు.. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన రామ్ తో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నాడట. ఆకాశ్ మొదటి సినిమా మెహబూబాకు చేసిన తప్పు మళ్లీ చేయకూడదని ఫిక్సయ్యాడట పూరి. ఇందుకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఐటమ్ సాంగ్ ఒకటి. అయితే ఈసారి రొటీన్ కు భిన్నంగా మేల్ యాక్టర్ తో ఆ పాటకు హైప్ తీసుకురానున్నాడట. ఇటివలే రామ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన పూరి మాటను కాదనలేకపోయాడట రామ్.

 

  

తన రఫ్ లుక్ తో పాటకు, సినిమాకు హైప్ తీసుకురానున్నాడట రామ్. ఇది ఖచ్చితంగా పూరి మార్క్ మ్యాజిక్ అనే అనుకోవాలి. గతంలో వెంకటేశ్ కృష్ణం వందే జగద్గురుమ్ లో నటించాడు. వెంకీ చింతకాయల రవిలో ఎన్టీఆర్ నటించాడు. ఇప్పుడు ఆకాశ్ కోసం రామ్ రానున్నాడన్న మాట. అందుకే మన మేకర్స్ దాదాపు ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తారు. పూరి చేస్తున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రెండ్ గా మారిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: