క్రేజీ హీరోయిన్ రష్మికకు ఆమె మాజీ ప్రియుడు హీరో రక్షిత్ శెట్టి ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడా అంటూ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రక్షిత్ శెట్టి నటిస్తున్న ‘అవనే శ్రీమన్నారాయణ’ మూవీని కేవలం కన్నడ భాషలోనే కాకుండా తెలుగుతో సహా ఐదు భాషలలో విడుదల చేయబోతు ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


రక్షిత్ శెట్టి కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో. ఈ సినిమాలోనే రష్మిక ఈ యంగ్ హీరోతో కలిసి నటించింది అక్కడ ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారి ఏకంగా వీరిద్దరి పెళ్లి ఎంగేజ్ మెంట్ వరకు వెళ్ళింది. అయితే ఆ తరువాత ‘ఛలో’ ‘గీత గోవిందం’ సినిమాలతో ఒకేసారి రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిన తరువాత 
రష్మికకు వరసపెట్టి అవకాశాలు రావడంతో ఈ క్రేజీ బ్యూటీ తన పెళ్ళి ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకుని రక్షిత్ కు షాక్ ఇచ్చింది.

దీనితో రక్షిత్ పేరు అంతా మర్చిపోయారు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీని ఎవరు పట్టించుకుంటారు అని అంకున్నారు అంతా. ఈ మధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినపుడు పెద్దగా రెస్పాన్స్ లేదు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూసాక ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం మారడంతో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడినట్లు టాక్. ఈ సినిమా ట్రైలర్ చూశాక జనాల అభిప్రాయం మారింది. 

ఈసినిమా విజువల్స్ సెటప్ టేకింగ్ అన్నీ కూడా భలేగా అనిపించాయి. ఎడిటింగ్ మరీ షార్ప్‌గా స్పీడుగా ఉండి కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎదో ఉంది అంటూ చాలామంది బయ్యర్లు ఎగబడుతున్నట్లు టాక్. గత ఏడాది ‘కేజీఎఫ్’ కన్నడ సినిమాను తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించినపుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు. కన్నడ సినిమాల్ని వేరే భాషల్లో ఎవరు పట్టించుకుంటారు? అంటూ జోక్స్ వేసారు. అయితే అనుకోకుండా ఆ మూవీ విడుదల అయ్యాక హీరో యశ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా క్రేజీ హీరోగా మారాడు. ఇప్పుడు అలాంటి అదృష్టమే అనుకోకుండా రక్షిత్ శెట్టికి కలిగితే అతడికి కూడ తెలుగు ప్రేక్షకులలో క్రేజ్ ఏర్పడితే అది రష్మికకు ఊహించని షాక్ గా మారే ఆస్కారం ఉంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: