అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్లాలెన్స్ ఉందట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రం తర్వాత బన్నీ సుకుమార్ తో సినిమాకి రెడీ అవనున్నాడు. సుకుమార్ స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసి బన్నీ కోసం వెయిట్ చేస్తున్నాడట.

 

అయితే అల వైకుంఠపురములో చిత్రం షూటింగ్ ఈ పాటికే పూర్తి కావాల్సి ఉందని సమాచారం. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుందట. త్రివిక్రమ్సినిమా షూటింగ్ అక్టోబర్ లోగా పూర్తి చేస్తానని చెప్పాడట. సాధారణంగా షూటింగ్ ఆలస్యం చేయడం త్రివిక్రమ్ అలావాటు గనక ఈ సినిమాకి కూడా లాగే అయ్యిందట. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అవడం వల్ల త్రివిక్రమ్, బన్నీల కంటే సుకుమార్ ఎక్కువగా నష్టపోతున్నాడు.

 


అన్నీ రెడీ ఉన్నా కూడా బన్నీ ఇంకా షూటింగ్ లో ఉండిపోవడంతో సినిమా స్టార్ట్ అవట్లేదు. ఈ డిసెంబరు నుండైనా స్టార్ట్ అవుతుందని భావించారు. డిసెంబరు నుండి బన్నీ సుకుమార్ కి డేట్స్ ఇచ్చాడట. కానీ ఇప్పుడు కూడా కుదరడం లేదు. ఇంకొన్ని రోజులైతే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడు సుకుమార్ సినిమా మరింత ఆలస్యం అవుతుంది.

 

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే సుకుమార్ సినిమా జనవరి చివరి వారంలో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. సుకుమార్ కూడా షూటింగ్ ఆలస్యం చేస్తాడు కాబట్టి ఈ సినిమా వేసవిలో విడుదలయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి వచ్చే ఏడాది ఆగస్టుకి లేదా దసరాకి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీన్ని బట్టి సుకుమార్ సినిమా లేట్ అవడానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: