విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. హ్యాపీ డేస్ సినిమా నుండి ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్నారు. సున్నితమైన ప్రేమ కథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల ప్రస్తుతం మరొక ప్రేమ కథతో మన ముందుకు వస్తున్నారు.

 

 

ఫిదా సినిమాతో అందరి మనసుల్ని ఫిదా చేసిన కమ్ముల మరో సారి ప్రేమ కథతో వస్తున్నాడు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య కెరీర్లో ౧౯ వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మజిలీ హిట్ తో జోష్ మీదున్న నాగచైతన్య మరోసారి ప్రేమ కథ చిత్రంలో..అదీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడంతో సహజంగానే అంచనాలు రెట్టింపయ్యాయి.

 

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లదే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆయన కథల్లో కథానాయికలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆనంద్, గోదావరి, ఫిదా లాంటి వాటిని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే నాగచైతన్యతో చేస్తున్న ఈ సినిమాలో కథ హీరో చుట్టూ తిరుగుతుందట. మొదటి సారి శేఖర్ కమ్ముల హీరో సెంట్రిక్ గా కథ రాసాడట. నిజానికి మొదట ఈ కథని కూడా హీరోయిన్ చుట్టే రాసుకున్నాడట.

 

కానీ నాగచైతన్య తో సినిమా కమిట్ అయ్యాక కథని మొత్తం మార్చి వేసి హీరో మీదకి మరల్చాడట. అందువల్ల హీరో పాత్ర హీరోయిన్ కి హీరోయిన్ పాత్ర హీరోకి వచ్చిందట. మరి మొదటి సారి హీరో బేస్ మీద సినిమా తీస్తున్న శేఖర్ కమ్ముల ప్రయత్నం ఫలిస్తుందా లేదా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: