విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం " వెంకీమామా". రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు రీల్ లైఫ్ లో మామా అల్లుళ్ళుగా మొదటి సారిగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలు ఈ పాటికే రిలీజ్ అయ్యాయి. ఈ పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఎట్టకేలకు డిసెంబరు 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

 

అయితే ఈ సినిమా ప్రెస్ మీట్ మొన్నే జరిగింది. సాధారణంగా సినిమా ప్రెస్ మీట్ లో హీరో హీరోయిన్లు తప్పక ఉంటారు. సినిమాలు నడిచేదే వాళ్ల వల్ల కాబట్టి వారు ప్రమోషన్స్ లో ఉంటేనే సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. కానీ వెంకీ మామా ప్రెస్ మీట్ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటీంచిన పాయల్ రాజ్ పుత్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె కనబడకపోవడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు.

 

అయితే పాయల్ ని కావాలనే ప్రెస్ మీట్ కి దూరం పెట్టారనే వార్తలు షికార్లు కొడుతున్నాయి. rx 100 సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ద్వారానే వెంకీ మామా సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మధ్యలో పాయల్ నటించిన ఆర్ డీ ఎక్స్ లవ్ సినిమా వల్ల ఆ గుర్తింపు పూరిగా తుడిచి పెట్టుకు పోయింది.ఆ సినిమాలో మరీ వల్గర్ గా కనిపించడం వల్ల ఆమెకి చెడ్డ పేరు వచ్చింది.

 

ఆర్ డి ఎక్స్ సినిమాలో నటించిన పాయల్ వెంకీ మామా సినిమాలో ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ రారేమోనన్న ఉద్దేశ్యంతో పాయల్ ని ప్రమోషన్స్ కి దూరం పెడుతున్నట్లు అర్థం అవుతుంది. ప్రసుతం ప్రెస్ మీట్ లో కనిపించని పాయల్ ముందు ముందు ప్రమోషన్స్ లో కూడా కనిపించే అవకాశం తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: