నిన్నటిరోజున జరిగిన ‘వెంకీ మామ’ మీడియా మీట్ లో వెంకటేష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఎప్పుడు గంభీరంగా కనిపించే వెంకటేష్ తన తీరుకు భిన్నంగా చాల హుషారుగా కనిపిస్తూ ఏకంగా తన అన్న సురేశ్ బాబు పై జోక్స్ వేయడంతో ఆమీడియా మీట్ అత్యంత ఉత్సాహబరితంగా జరిగింది. 

అయితే ఈమీడియా మీట్ కు వెంకటేష్ నాగచైతన్య రాశి ఖన్నాలు మాత్రమే వచ్చారు. మరొక హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ కనిపించక పోవడంతో ఆమె ఈమీట్ కు ఎందుకు డుమ్మా కొట్టింది అంటూ ఎంక్వైరీలు చేసినట్లు టాక్. అయితే ఈమూవీ యూనిట్ వారు మాత్రం పాయల్ తన సినిమాల షూటింగ్ బిజీలో ఉండటం వల్ల రాలేకపోయింది అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీనితో తన కెరియర్ కు అత్యంత కీలకమైన వెంకీ మామ మీడియా మీట్ ను వదిలి పాయల్ ఏ సినిమా షూటింగ్ లో ఉంది అంటూ జోక్ చేసుకున్నట్లు టాక్. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈమీడియా మీట్ కు ఈమూవీ నిర్మాతలు కావాలని వ్యూహాత్మకంగా పాయల్ ను పక్కకు పెట్టారు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. 

దీనికికారణం ఇప్పుడు ఆమెకు ఏర్పడ్డ హాట్ హీరోయిన్ ఇమేజ్ అని అంటున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ తరువాత పాయల్ నటించిన సినిమాలు అన్నీ ఎక్స్ పోజింగ్ కే పరిమితం అయ్యాయి. దీనితో నిన్నటి మీడియా మీట్ లో ఆమెను చూస్తే ఈసినిమా కూడ పాయల్ ఎక్స్ పోజింగ్ సీన్స్ తో ఉంటుంది అన్న తప్పుడు అభిప్రాయలు ఫ్యామిలీ ప్రేక్షకులకు వెళతాయి అన్న ఉద్దేశ్యంతో తెలివిగా పాయల్ ను పక్కకు పెట్టారు అన్న లీకులు వస్తున్నాయి. దీనితో అతిత్వరలో జరగబోతున్న ‘వెంకీ మామ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడ పాయల్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అంటూ మరికొందరు గుసగుసలు ఆడుకున్నట్లు సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: