బిగ్ బాస్ 2 లో పాల్గొన్న సంజన మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు నాలుగు రోజుల క్రితం సంజన ఫిర్యాదు చేసింది. ఒక పబ్ లో అశిష్ అమర్యాదగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని సంజన ఫిర్యాదులో పేర్కొంది. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీంచిన తరువాత అశిష్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
కేసును రాజకీయ ఒత్తిళ్ల వలన నీరుగారుస్తున్నరని సంజన చెప్పింది. పోలీసులు మాత్రం మొదట సంజన అశిష్ కు హగ్ ఇఛ్చినట్లు తేలిందని చెబుతున్నారు. సంజన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశానని కేసులో పురోగతి లేదని చెప్పింది. పోలీసుల నుండి నాలుగు రోజుల నుండి రెండు బృందాలు వెతుకుతున్నాయనే సమాధానం మాత్రమే వస్తోందని సంజన చెప్పింది. 
 
ఈ ఘటనలో నా తప్పు లేదని సంజన మరో మారు స్పష్టం చేసింది. ఫుటేజీలో ఏమీ లేకపోతే ఆ అబ్బాయికి పారిపోవాల్సిన అవసరం ఏమిటి...? అని సంజన ప్రశ్నించింది. రాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగిందని సంజన చెప్పింది. ఆయనెవరో కూడా నాకు తెలీదని పబ్బుల్లో రాజకీయ జీవితం పాడు చేస్తారా అని సంజన ప్రశ్నించింది. ఫుటేజీ చూసిన తరువాత నా తప్పు ఉందని తేలితే మీడియా మిత్రులందరికీ క్షమాపణ చెబుతానని సంజన చెప్పింది.
 
నేను పచ్చిగా మీలా బూతులు మాట్లాడలేనని మీడియాలోనే అశిష్ బూతులు మాట్లాడారని సంజన చెప్పింది. సెలబ్రిటీ అయిన నాకే న్యాయం జరగకపోతే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని సంజన ప్రశ్నించింది. ఆదివారం తెల్లవారుజామున నోవాటెల్ లో ఖాళీ మద్యం బాట్టిళ్లను విసిరాడని తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని తమతో అశిష్ అసభ్యకరంగా ప్రవర్తించాడని సంజన నాలుగురోజుల క్రితం ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: